Telugu News

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

◆ 14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్.

0

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..
◆ 14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్.
◆ పలు సూచనలు చేసిన మంత్రి పువ్వాడ.. పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. రఘునాధపాలెం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే 14 ఎకరాల ప్రభుత్వ భూమిని వెలికి తీసి మొత్తం రూ. 1.50 కోట్లతో అత్యద్భుతంగా నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం, ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనుల పురోగతిని పరిశీలించారు. రఘునాధపాలెం మండల బృహత్ పల్లె ప్రకృతి వనం ఖమ్మం జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరిత తెలంగాణలో భాగంగా అటవీ సంపదను పెంపొందించేందుకు పల్లె ప్రకృతి వనాలు దోహదపడతాయన్నారు.

also read :-నగరంలో మరో రెండు వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు : మంత్రి పువ్వాడ

నాటే మొక్కలు, రకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే జామ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, నేరేడు, పారిజాతం, కరివేప, తదితర 31 వేల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. బండ్ చుట్టూ బయోఫెన్సింగ్‌, దానిని అనుకుని పక్కనే మొక్కలు వేయాలన్నారు. మెయిన్‌గేట్‌, వాకింగ్‌ట్రాక్‌, ఆట స్థలం ఉండేలా చూడాలని సూచించారు. బండ్ కు నీరు వచ్చే విధంగా పైపులు ఏర్పాటు చేయాలని అందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించి బండ్ లోకి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న బండ్ ట్రాక్ ను మరింత విస్తరించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల వేగం పెంచాలని, నిత్యం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , జడ్పీ సీఈఓ అప్పారావు , డీపీవో ప్రభాకర్, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు ఉన్నారు.