ఘనంగా ఎంఎల్ఏ కందాళ జన్మదిన వేడుకలు : ఎం.పీ.పీ మంగిలాల్
ప్రజాసమస్యలపై స్పందిస్తూ ప్రజాసేవే పరమావధిగా నిరుపేదల కష్టాల్లో పాలుపంచుకుంటూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిగా నిలిచారని తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగిలాల్ అన్నారు
ఘనంగా ఎంఎల్ఏ కందాళ జన్మదిన వేడుకలు : ఎం.పీ.పీ మంగిలాల్
(పాలేరు – విజయం న్యూస్)
ప్రజాసమస్యలపై స్పందిస్తూ ప్రజాసేవే పరమావధిగా నిరుపేదల కష్టాల్లో పాలుపంచుకుంటూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిగా నిలిచారని తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగిలాల్ అన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బోడ మంగిలాల్ ఆధ్వర్యంలో పాలేరు ఎంఎల్ఏ కందాళ ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
also read :- సంబరంగా రైతుబంధు ఉత్సవాలు..
ఈ సందర్భంగా ఎంపీపీ మంగిలాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాళ నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్దే లక్ష్యంగా,ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నారని,రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం
ఎంపీపీ మంగిలాల్ ఆయన ఛాంబర్ లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.తొలుత ఎంఎల్ఏ కందాళ ఉపేందర్ రెడ్డి కరోనా నుండి త్వరగా కొలుకోవాలని మండల ప్రజాప్రతినిధులు పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు రమేష్,పుల్లూరి యాకమ్మ నాగరాజు,హాలవత్ జ్యోతి శ్రీను,మాలోత్ బిక్షం,బండ్ల విజయసురేష్,ఎంపీటీసీలు గుగ్గిళ్ల అంబేద్కర్,చుంచు వెంకటేశ్వర్లు,కో ఆప్షన్ సైఫుద్దీన్,నాయకులు హరికిషన్,చీమ్లా…పాల్గొన్నారు.
also read :-ఐదు రాష్ట్రాలకు మోగిన నగారా