Telugu News

హరితహారం చెట్లు అగ్నికి ఆహుతి…!

అధికారులు జర దేకో...

0

హరితహారం చెట్లు అగ్నికి ఆహుతి…!

అధికారులు జర దేకో…

(మహబూబాబాద్- చిన్నగూడూరు విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి మొక్కల సంరక్షణ బాధ్యతను అధికారులకు అప్పగించడం జరిగింది. వేసవి కాలంలో కూడా మొక్కల సంరక్షణ కోసం నీటి ట్యాంకర్లతో నీటిని మొక్కలకు అందిస్తూ మొక్కలను కాపాడుతూ వస్తుంది. కానీ మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని జయ్యారం గ్రామంలో పొలిమేరలో ఓ రైతు చేసిన పనికి హరితహారం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వానకాలం పంటల సాగు కోసం రైతులు పంట చేనులను సిద్ధం చేసుకుంటున్నారు చేన్లో గట్లపై పిచ్చి మొక్కలను,ఎండిపోయిన గడ్డిని కాల్చివేస్తున్నారు.

also read :-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యునిగా గజ్జెల. రాజశేఖర్……

దీంతో మంటలు ప్రమాదవశాత్తు ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలకు అంటుకొని పూర్తిగా కాలి పోతులన్నాయి. ఇలా పలుమార్లు జరిగిన అధికారుల పట్టింపు లేదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. వివిధ గ్రామపంచాయతీ పరిధిలో మేకలు, గొర్రెలు, మూగజీవాలు హరితహారం మొక్కలను మేసాయని అని ఫిర్యాదు రావడంతో అట్టి యజమానులకు 3000 నుంచి 5000 జరిమానాలు వేసిన సందర్భాలు ఎన్నో చూశాం. అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతులకు సరైన అవగాహన కల్పించక పోవడంతో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ వస్తున్నాయి. రహదారులకు ఇరువైపుల ఉన్న రైతులకు అవగాహన కల్పించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిత ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.