తిరుమలాయపాలెంలో ‘పొంగులేటికి’ బ్రహ్మరథం
== పలకరింపులు… పరామర్శలు…
– తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటన
– అంబేద్కర్ విగ్రహానికి పూలమాల
– దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
(తిరుమలాయపాలెం-విజయంన్యూస్);-
మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తిరుమలాయపాలెం మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. గురువారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన ఆయనకు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఆయన కారు దిగిన వెంటనే పూలవర్షంకురిపించారు. వందలాధి మంది రాకతో తిరుమలాయపాలెం మండల కేంద్రం సందడిగా మారింది.
also read :-ఉత్తరప్రదేశ్ అందుకే గెలిచిందా..?
ఆత్మీయ పలకరింపులు… ఆలింగనలు… పరామర్శలు చేస్తూ నేనున్నా అనే నమ్మకాన్ని ప్రతిఒక్క బాధితుల్లో కలగజేస్తూ తిరుమలాయపాలెం మండలంలో గురువారం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంతో పాటు పిండి ప్రోలు, గోల్ తండా, ఇస్లావత్ తండా సుబ్లేడు, రఘునాథపాలెం, మంగళిబండ తండా, కాకరవాయి తదితర గ్రామాలను సందర్శించారు. పొంగులేటి అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రతిఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తు ఉల్లాసంగా… ఉత్సాహంగా తన పర్యటనను కొనసాగించారు.
also read;-శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
తిరుమలాయపాలెంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థికసాయం అందజేశారు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆర్ధిక సాయం చేసి నేనున్నా మీకేం కాదనే భరోసాను ఇచ్చారు. ఇటీవల వివాహం చేసుకున్న పలు జంటలను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఇతర శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. అలాగే పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, రామసహాయం నరేష్ రెడ్డి, ముద్దిరెడ్డి లచ్చిరెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, సిరిగద్దెల ఉపేందర్, ఇస్లావత్ రవి, చావా శివరామకృష్ణ, సుమన్, ఫయాజ్, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, చామకూరి సురేందర్, చామకూరి ఉపేందర్, వెంకటేశ్వర్లు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ దొడ్డా నగేష్ తదితరులు పాల్గొన్నారు.