Telugu News

పేదల సొంత ఇంటి కల గృహ లక్ష్మీపథకం.. మంత్రి పువ్వాడ..

గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ.*

0

పేదల సొంత ఇంటి కల గృహ లక్ష్మీపథకం.. మంత్రి పువ్వాడ..

== గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ.*

== డబుల్ బెడ్ రూం ఇళ్లకు అదనంగా గృహ లక్ష్మీ పథకాన్ని అందిస్తున్న BRS ప్రభుత్వం.*

== నియోజకవర్గానికి 3వేలు.. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల ఇళ్ల కోసం రూ.12వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.*

== వచ్చేది BRS ప్రభుత్వమే.. మళ్ళీ గెలిచేది నేనే.. మీ అందరికీ ఈ పథకం ను అందించే బాధ్యత నాదే..*

== రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.*

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

పేద వాడి సొంతఇంటి కల ను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ గారు గృహలక్ష్మి పథకంను తీసుకొచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం ఖమ్మం కార్పొరేషన్ లోని 2,3,4,8,26వ డివిజన్లు, రఘునాధపాలెం మండలం బూడిదంపాడు, ఈర్లపుడి గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఖమ్మం నియోజకవర్గంలో మంజూరైన లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పత్రాలు అందజేసి పంపిణి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం: మంత్రి హర్షం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు ఖమ్మం నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు అదనంగా నేడు ఈ పథకం ద్వారా సొంత జాగ ఉన్న వారికి తమ సొంత ఇంటి కల ను నెరవేర్చామని పేర్కొన్నారు.

ఇప్పటికే వైఎస్ఆర్ నగర్ లో 230 ఇల్లు, టేకులపల్లిలో 2వేల ఇల్లు ఒకే సముదాయం లో నిర్మించి గేటేడ్ కమ్యూనిటీ తరహాలో అద్భుతంగా ఇల్లు నిర్మించి ఇచ్చినం అన్నారు. మరి కొన్ని చోట్ల ఇల్లు నిర్మాణం జరుగుతున్నాయని వాటికి కూడా అర్హులైన పేదలకు పూర్తి పారదర్శకంగా అందిస్తామన్నరు.

గడచిన అతితక్కువ సమయంలో నగరంలో 5వేల మందికి ఇల్లు నిర్మించామని, 4వేల మందికి GO. నెం.58 ద్వారా పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చామని అన్నారు.

ఇది కూడా చదవండి:- సైంటిస్ట్ ఉమా మహేశ్వరరావు ను సత్కరించిన మంత్రి పువ్వాడ..

గృహలక్ష్మీ పథకం పేదల కుటుంబాలను మెరుగుపరచడానికి, వారికి భద్రత, స్థిరత్వ భావనను అందించడానికి సహాయపడుతుందని, ఈ పథకం ద్వారా నిర్మాణ రంగంలో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా పేదలకు పనులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగు పడుతుందని. భావిస్తున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు వెచ్చిచి మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందన్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కు 3వేల ఇళ్లను నిర్మించనున్నామని, ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 4వేల ఇళ్లకు దరఖస్తులు రాగా ఇప్పుడు రెండు వేల ఇళ్లకు మంజూరు పత్రాలు అందిస్తున్నామని, రెండవ విడతలో మళ్ళీ మిగిలిన రెండు వేల ఇళ్లను కూడా మీకు అందిస్తామని ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదన్నారు.

వచ్చేది BRS ప్రభుత్వమే.. ఇక్కడ ఉండేది నేనే.. మళ్ళీ మీ అందరికీ ఆ మంజూరు పత్రాలు అందించేది నేనే అని, మీకు ఇచ్చే బాధ్యత నాదే అని.. ఎం ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

ఇది కూడా చదవండి:- అభివృద్ధి లో తెలంగాణ నెం 1: మంత్రి హరీష్

గృహలక్ష్మి పథకం మంజూరైన లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయా పత్రాలను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణి చేశారు.

జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విత్తనభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అర్డిఓ గణేష్, తహశీల్దార్ స్వామి, జడ్పిటిసి ప్రియాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్స్, నాయకులు ఉన్నారు.