Telugu News

జి టి ఎస్ ఎస్ ఎస్ వారి చేయూత..

మణుగూరు రూరల్ విజయం న్యూస్

0

జి టి ఎస్ ఎస్ ఎస్ వారి చేయూత..

(మణుగూరు రూరల్ విజయం న్యూస్):-

జీ టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ ఖమ్మం వారిచే పినపాక మండలం తో గూడెం గ్రామంలో గల జి టి ఎస్ ఎస్ ఎస్ చైల్డ్ కేర్ సెంటర్ నందు. గల 90 మంది. నిరుపేద పిల్లలకు ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయమని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎంపీపీ గుమ్మడి. గాంధీ, ఎంపీటీసీ చింతపాటి సత్యం, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కటకం. గణేష్, తో గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. శ్రీలత, ఉప సర్పంచ్ బుస్సీ. శ్రీను వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

also read :-నేటి నుంచి గార్లఒడ్డు లో బ్రహ్మోత్సవాలు.
ఈ సందర్భంగా గుమ్మడి. గాంధీ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు పిల్లలందరూ ఇటువంటి మంచి అవకాశాలను ఊహించు కొని. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జి టీ ఎస్ ఎస్ ఎస్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు తోగూడెం పంచాయితీ టిఆర్ఎస్ అధ్యక్షుడు కారుకురి. తిరుపతి రాజు, టిఆర్ఎస్ పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ. మనోజ్ రెడ్డి, చైల్డ్ కేర్ సెంటర్ ఇంచార్జి మైపా.యెసేపు, సిబ్బంది మురళి కృష్ణ రెడ్డి, అశోక్ కుమార్, సైదులు, టీచర్స్ రమాదేవి, రాంబాబు, కళావతి మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.