Telugu News

గ్యారంటీ…వారంటీ లేని వారి మాటలు నమ్మొద్దు:,నామ

సమైఖ్యoగా మదన్ లాల్ ను గెలిపించుకుందాం

0

గ్యారంటీ…వారంటీ లేని వారి మాటలు నమ్మొద్దు:,నామ

🔶 సమైఖ్యoగా మదన్ లాల్ ను గెలిపించుకుందాం

🔶 దేశంలో తెలంగాణా నెంబర్ వన్

👉 వైరా పట్టణ, రూరల్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు 

వైరా, అక్టోబర్ 02(విజయం న్యూస్ ):

ఎన్నికలొచ్చినప్పుడు వచ్చి చెప్పే వారి మాయ, మోసపు మాటలను నమ్మొద్దు… దేశంలోనే తెలంగాణాను నెంబర్ వన్ గా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ కే పట్టం గట్టి, వైరాలో సమైఖ్యoగా మదన్ లాల్ ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ, వైరా నియోజకవర్గ ఇంచార్జి నామ నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- లోక్ సభ అభ్యర్థిగా  ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?

సోమవారం వైరా లో కమ్మ వారి కల్యాణ మండపంలో పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలను నేను చూసుకుంటా అంతా బాధ్యతతో పని చేసి, మదన్ లాల్ గెలువునకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయరని, ఇక్కడకు వచ్చి మాయ మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తాగు, సాగు నీరు, కరెంట్ లేక రైతులు అప్పులపాలై , ఆత్మ హత్యలకు పాల్పడిన దౌర్భాగ్య దుస్థితి ఉండేదని, కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనన్ని అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నేడు 90 శాతం పదవులు కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. ప్రజలు ఆలోచించాలని నామ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- ఎన్టీఆర్ స్పూర్తితో కేసీఆర్ అద్భుత ప్రగతి: నామ

ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి బాణోత్ మదన్ లాల్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పావని, జెట్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపల్ వైస్ చైర్మన్ సీతారాములు , దిశ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, జెట్పీ కో అప్షన్ లాల్ అహ్మద్, కొత్తా వెంకటేశ్వరరావు, మేడూరి రామారావు, పసుపులేటి మోహన్ రావు,చిత్తారు సింహాద్రి యాదవ్, నామ సేవా సమితి నుంచి చీకటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

👉నామ సమక్షంలో చేరికలు

ఈ సందర్భంగా గొల్లెన పహాడ్ లో వివిధ పార్టీలకు చెందిన 15 కుటుంబాలు వారు నామ నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నామ, ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.