పార్కులకు గుమ్మం ‘ఖమ్మం’: మంత్రి పువ్వాడ
== నాడు మురికి కూపాలు.. నేడు ఆహ్లాదాన్ని పంచే పార్కులు..
== 11 కీలోమీటర్ల మేర విస్తరించిన గోళ్ళపాడు ఛానల్ పై 10 పార్కులు..
== సకల సౌకర్యాలు.. సకల క్రీడలు, సకల వసతులతో ప్రజలకు ఆహ్లాదం..
== రాజకీయాలకు అతీతంగా పార్కులకు తెలంగాణ వైతాళికులు పేర్లు..
== మంత్రి నిర్ణయాన్ని హర్షిస్తు కృతజ్ఞతలు చెప్తున్న ప్రజలు..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో మరిన్ని పార్కులు కొలువయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజన్ తో గోళ్ళ పాడు ఛానల్ ఆధునీకరణతో మురికి కూపంలా ఉన్న ఖమ్మం మూడవ పట్టణంకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీనితో ఇక్కడ ఉండేందుకు కూడా ఇష్టపడని ప్రజలు నేడు ఇక్కడ చిన్న స్థలం కొనేందుకు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ నివాసం ఉండాలంటే ముక్కు మూసుకుని జీవించే దుస్థితి నుండి నేడు మాది త్రీ టౌన్ అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి 3టౌన్ ను అభివృద్ధి చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గోళ్ళపాడు ఛానల్ ను ఆదునికరించి చేతులు దులుపుకోకుండా వాటిని ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దానిపై అనేక సదుపాయాలతో ప్రజలకు నిత్యం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందాలని ఆకాంక్షించారు.
allso read- జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తాం:మంత్రి పువ్వాడ
దాదాపు 11కిలోమీటర్ల నడివి ఉన్న ఛానల్ కింద పెద్ద పెద్ద పైప్ లైన్ లు అమర్చి నగరంలోని వర్షపు నీరు, మురుగు నీరు అండర్ గ్రౌండ్ ద్వారా ప్రవహించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మున్నేరు లో కలిసే విధంగా ప్రణాళికలు చేసి పూర్తి చేశారు. దీనితో పాటు ఆయా వర్షపు నీరుతో మున్నేరు ఒడ్డున సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను నెలకొల్పి అక్కడ నీరు శుద్ది చేసి నగర ప్రజలు అందించే అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆధునీకరించిన
గోళ్ళపాడు ఛానల్ అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలకు గురికాకుండా అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయా పార్కులను ఏర్పాటు చేశారు. రూ.100 కోట్లతో ఖమ్మం త్రీ టౌన్ లోని గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించి దానిపై దాదాపు 11 కిలోమీటర్ల మేర అండర్ డ్రైనేజ్, అండర్ సివేజ్ ట్రీట్ మెంట్ వాటర్ కోసం పైప్ లైన్ ఎర్పాటు చేయడం జరిగింది. ఆయా ఛానల్ పై దాదాపు 10 పార్కులు నిర్మించడం జరిగిందని, దాదాపు 4పార్క్ లు పూర్తి కాగా ఇంకా ఆరు పార్క్ లు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆయా పార్కులలో బాస్కెట్ బాల్, షటిల్, మెగా చేస్ బోర్డు, స్కేటింగ్ రింక్స్, గ్రీనేరీ, చిల్డ్రన్స్ పార్క్స్, ఆట వస్తువులు, పంచతత్వ పార్క్, ఫౌంటైన్స్, వాకింగ్ ట్రాక్స్, త్రాగు నీరు, పబ్లిక్ టాయిలెట్స్, పార్క్ ముఖ ద్వారంలో ఆర్చ్ లు, బల్లాలు, పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్ లు, తదితర వసతులను కల్పించారు. ఆయా పార్కులకు తెలంగాణ వైతాళికులు ప్రొఫెసర్ జయశంకర్ సార్, కాళోజీ నారాయణ రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, మంచికంటి రామకృష్ణ రావు, పద్మశ్రీ వనజీవి రామయ్యా, రజబ్ అలీ తదితరుల పేర్లను పెట్టి రాజకీయాలకు అతీతంగా పేర్లను నామకరణం చేశారు.
allso read- ఖమ్మం నగర అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పువ్వాడ
ఈ చర్యలతో త్రీ టౌన్ ప్రజలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొనసాగుతున్న ఆయా పార్కు పనులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి పరిశీలించారు. వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ ధరణి, తహసిల్దార్ శైలజ, కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు.