Telugu News

గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని మృతి

గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన సంధాని

0
గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని మృతి
== గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన సంధాని
==  పొంగులేటి,పాయం, తుళ్లూరి సంతాపం
(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్):
గుండాల మండలానికి చెందిన ఎంపీటీసీ ఎస్ కె సంధాని అకాలంగా మృతి చెందారు. గుండాల నుంచి కొత్తగూడెం వెళ్తుండగా మార్గంమధ్యలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో గుండాల మండలంలో విషాదం  నెలకొంది. సంధాని చనిపోయిన వార్త తెలుసుకున్న తెరాస రాష్ట్రనాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్