Telugu News

గురువుకే పంగనామాలు పెట్టినోడు పొన్నం: బండి సంజయ్ 

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు.

0

*గురువుకే పంగనామాలు పెట్టినోడు పొన్నం: బండి సంజయ్ 

*చొక్కరావు, ఎమ్మెస్సార్ ఓటమికి కారకుడైన జగపతిరావు కొడుకును వెంటేసుకుని తిరగడానికి సిగ్గు లేదా?*

*ఎస్…ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లడిగే బిచ్చగాడిని నేను.. మీలెక్క ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాను..*

*ఎన్నికలప్పుడు తప్ప వినోద్ రావుకు షర్ట్ నలగదు..చెమట పట్టదు*

*కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు నాన్ లోకల్ కాబట్టే ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు*

*పక్కా లోకల్ కాబట్టే… రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా*

*ఎల్కతుర్తి నుండి సిద్దిపేట, కరీంనగర్ నుండి వరంగల్ రోడ్ల విస్తరణకు వేల కోట్లు తీసుకొచ్చా*

*6 గ్యారంటీలపై ప్రశ్నిస్తే… నాపై వ్యక్తిగత దూషణలు చేస్తారా?*

*గడీలు బద్దలు కొట్టి కేసీఆర్ ను గద్దె దించిన చరిత్ర నాది*

*6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించి బుద్ది చెప్పండి*

*హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తా…*

*హుస్నాబాద్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్*

*బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు..*

(కరీంనగర్ -విజయం న్యూస్)

రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొడుకునే వెంటేసుకుని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, అట్లాంటి వ్యక్తి తనపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అడుగడుగునా అండగా నిలిచానని, ఆనాడు పొన్నం ప్రభాకర్ యాడ దాచుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తప్ప బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ రావుకు చొక్కా నలగదు.. చెమట పట్టదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రజల కష్టాలను పట్టించుకోని వ్యక్తి తనపై విమర్శలు చేయమేంటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి:- మనమే నెంబర్ వన్: బండి సంజయ్ 

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు భారీగా జనం తరలివచ్చారు. వేలాది మంది రాకతో హుస్నాబాద్ జన సంద్రమైంది. బండి సంజయ్ ప్రసంగాన్ని వినేందుకు భవనాలపైన, దుకాణాలపైన నిలబడి ఎదురు చూశారు. ఈ మీటింగ్ కు బండి సంజయ్ తోపాటు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

నేను రాముడంటే వాళ్లకు భయమెందుకు?… వాళ్లకు బండి సంజయ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నడు.. బండి సంజయ్ ఏం చేసిండని అడుగుతున్నడు.. నేను రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. అభివ్రుద్ది చేసిన.. పోరాటాలు చేసిన… ప్రజల కోసం పనిచేసిన.. కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుతా.. నన్ను బిచ్చగాడంటున్నరు. బరాబర్ నేను బిచ్చగాడినే. ఓట్లు అడుకుంటున్న… వాళ్ల లెక్క ఓట్లు కొనాలనుకుంటున్నరు.
వాళ్లు గెలిస్తే వందల కోట్ల నుండి వేల కోట్లు సంపాదిస్తరు… నేను గెలిస్తే వందల కేసులున్న నాపై వేల కేసులు భరించేందుకు నేను సిద్దం.

ఇది కూడా చదవండి:- ఐఎన్ సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి సంజయ్
మంత్రి అంటడు.. బండి సంజయ్ డబ్బులెన్ని ఎట్లా సంపాదించిండని అంటున్నరు. నేను మంచి బట్టలేసుకోవద్దా? నేను ఎంపీని కానా? మీ లెక్క కోట్లు సంపాదించానా?

నేను 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నరు. ఇచ్చారా? నెలనెలా రూ.2500లు ఇస్తామన్నరు. తులం బంగారం, స్కూటీ ఇస్తానన్నరు. ఆసరా పెన్షన్ రూ.4 వేలు, రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నరు. వడ్లకు బోనస్ క్వింటాలుకు రూ.500 ఇస్తామన్నరు. తాలు, తరుగుతో సంబంధం లేకుండా వడ్లు కొంటానన్నరు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు… ఇందులో ఒక్కటైనా ఇచ్చారా? మరి ఎందుకివ్వలేదు? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నాపై విమర్శలు చేస్తారా?

నేనడుగుతున్నా.. కరోనా వచ్చినప్పుడు ఈ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్ధితోపాటు బీఆర్ఎస్ అభ్యర్ధి ఎటు పోయిర్రు. నేను చావుకు తెగించి కరోనా వార్డులోకి వెళ్లి రోగులకు భరోసా కల్పించిన. వైద్యులు, సిబ్బందికి అండగా నిలిచిన. మరి మీరెక్కడున్నారు? ఎల్కతుర్తి నుండి సిద్దిపేట రోడ్డు విస్తరణ కోసం రూ.550 కోట్లకు పైగా నిధులు తెచ్చిన.. మరి మీరెందుకు తేలేదు?

6 గ్యారంటీల అమలుపై నేను చర్చకు సిద్ధం… మీరు సిద్ధమా? ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడితే నాపై వ్యక్తిగత దూషణలు చేస్తారా? నా గుండుమీద ఉన్న శ్రద్ద 6 గ్యారంటీల అమలుపై ఎందుకు చేస్తలేరు?

బీజేపీ గుర్తు కమలం. ఆ గుర్తును పెట్టుకుని నేను ఓట్లడుగుతున్న. మరి వాళ్లు గాడిద గుడ్డు పట్టుకుని అడుగుతున్నరు…. బ్యాలెట్ బాక్సులో గాడిద గుడ్డు ఉంటే కాంగ్రెస్ కు ఓటేయండి. లేకుంటే ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలి.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడతాం: బండి సంజయ్ 

ఇయాళ ఎరువులకు సబ్సిడీ ఇస్తోందెవరు?…ఒక్కో ఎకరానికి నరేంద్రమోదీ ఎరువుల పేరుతో రూ.20 వేలదాకా సబ్సిడీ ఇస్తున్నరు. మోదీ మళ్లీ గెలవకపోతే సబ్సిడీలన్నీ ఆగిపోతయ్. యూరియా, పొటాషియం, డీఏపీ రేట్లు పెరుగుతాయ్.
మీకోసం కొట్లాడింది మేము.. ఓడినా, గెలిచినా వినోద్ రావుకు కరీంనగర్ గుర్తుకు రాదు… నామీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా రాలేదు.. అట్లాంటోడిని మళ్లీ ఎట్లా గెలిపించారో మీకే తెలియాలి.
హుస్నాబాద్ లో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదో మంత్రి ఎందుకు చెప్పలేదు?
వినోద్ ను అడుగుతున్నా… 10 ఏళ్ల పాలనలో రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్నడైనా మాట్లాడినవా? పంట నష్టపోతే పరిహారం ఇప్పించిండా? ఉద్యోగాల రాక నిరుద్యోగులు అల్లాడితే ఉద్యోగాలిప్పించినవా? విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపినవా? మరి నీకెందుకు ఓటేయాలి?

గౌరవెల్లి సమయంలో మంత్రి ఏం చేసిండు. నేను గౌరవెల్లి బాధితుల కోసం అండగా నిలిచిన. అర్ధరాత్రి కోసం వారికోసం వచ్చి పోరాటం చేసిన. మరి పొన్నం ఆనాడు ఏం చేసిండు? నేనడుగుతున్నా.. చొక్కారావు నా గురువు అని చెప్పుకునే పొన్నం ప్రభాకర్ … నీ గురువు ఓడిపోవడానికి కారకుడైన వెలిచాల జగపతిరావు కొడుకుకు టిక్కెట్ ఇప్పించిండు. ఎమ్మెస్సార్ ఓటమికి కారకుడైన వ్యక్తి కొడుకును పక్కనపెట్టుకుని తిరుగుతున్నడు. సత్యానారాయణగౌడ్ ఓటమికి కారణమైన నేతను పక్కనేసుకుని తిరుగుతున్నడు. మీరా నా గురించి మాట్లాడతరా?

నేను ప్రజల పక్షాన కొట్లాడితే నాపై 109 కేసులు పెట్టిర్రు. అయినా నేను భయపడలే.. మరి ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ ఎన్నడైనా మీకు కన్పించిండా? మీ కోసం ఎప్పుడైనా పోరాడిండా? ఫోన్ ట్యాపింగ్ పైసలతో టిక్కెట్ కొనుక్కుని ఆ సొమ్ముతోనే ఓట్లు కొనాలని చూస్తున్నడు..

వినోద్ రావు ఫుల్ టిప్ టాప్ మనిషి.. ఆయనకు షర్ట్ నలగొద్దు.. చెమట రావొద్దు.. ఈ మధ్య వినోద్ రావు మంచోడే.. కేసీఆర్ మంచోడు కాదనే ప్రచారం చేయించుకున్నడు.. నువ్వు మంచోడివైతే ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు ఆదుకోలేదు. నువ్వు అసలు ఈ జిల్లా వాడివి కాదు.. పక్కా లోకల్ కాదు కాబట్టే అభివ్రుద్ది పనులు చేయలే.

నేను పక్కా లోకల్ కాబట్టే అవన్నీ చేశాను. మీ కోసం పోరాడిన. మీ కోసం జైలుకు పోయిన. మీకోసం నిరంతరం కొట్లాడుతున్న. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన. అయినా ఇద్దరూ కలిసి నాపై దొంగ వీడియోలు స్రుష్టించి దుష్ప్రచారం చేస్తున్నరు. హుస్నాబాద్ ప్రజలు 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధమైనరని భయపడి ఈ డ్రామాలాడుతున్నరు.

గడీలను బద్దలు కొట్టి కేసీఆర్ ను గద్దె దించిన చరిత్ర బండి సంజయ్ ది. కరీంనగర్ పార్లమెంట్ బిడ్డను. నాలోని కరీంననగర్ పౌరుషం, ఆగ్రహం, పోరాట తత్వంతో కేసీఆర్ అరాచకాలపై తిరగబడ్డా. తెలంగాణ సొమ్మును పంజాబ్ తీసుకుపోతే నిలదీసిన. మీకోసం మేం కొట్లాడిన.

6 గ్యారంటీలపై మేం నిలదీస్తుంటే… రిజర్వేషన్ల రద్దు డ్రామాను మొదలుపెట్టారు. అగ్ర వర్ణ పేదలకే రిజర్వేషన్లను ఇస్తున్న మోదీ గారు… ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే నమ్మేదెవరు? నేను ఈ హుస్నాబాద్ సాక్షిగా చెబుతున్నా… రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు.. మరి కాంగ్రెస్ కు ‘ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయబోమనే దమ్ముందా?

కాంగ్రెస్ నేతలరా…6 గ్యారంటీలను అమలు చేయకుంటే బండి సంజయ్ తడాఖా చూపిస్తా… ఎన్నికలైనంక కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తా… ఇదే హుస్నాబాద్ గడ్డపై కాంగ్రెస్ నేతలను నిలదీస్తా.. పేదలకు అండగా ఉంటాం.. కాంగ్రెస్ కార్యకర్తాలారా… 6 గ్యారంటీలపై మోసం చేస్తున్న మీ పార్టీ పెద్దలకు తగిన బుద్ది చెప్పండి… నాపై ఫేక్ వీడియోలు స్రుష్టించి లబ్ది పొందాలని చూస్తున్న ప్రజాలారా… వాటిని నమ్మకండి.. 6 గ్యారంటీలను నమ్మి మోసపోయింది చాలు… వాళ్లకు బుద్ది చెబుదాం…