గుర్వాయిగూడెం రామాలయం లో చోరీ
— హుండీలను పగలగొట్టిన దుండగులు
(కూసుమంచి -విజయం న్యూస్)
రామాలయంలో అర్థరాత్రి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కూసుమంచి మండలంలోని గుర్వాయిగూడెం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి హుండి పగులగొట్టి నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయం వద్దకు వెళ్ళిన భక్తులు చూసి స్థానికులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కూసుమంచి పోలీసులు సంఘటన స్తలానికి వెళ్ళి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.