ఆదిత్య థియేటర్లో అఖండ అర్థ శతదినోత్సవ వేడుకలు
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలోని ఆదిత్య థియేటర్ లో అఖండ అర్థ శతదినోత్సవ వేడుకలు గురువారం రోజున సాయంత్రం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాసరావు, నందమూరి యువసేన అధ్యక్షుడు నల్లమల రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా అర్థశత దినోత్సవం వేడుకలనూ జరుపుకున్నారు
also read :-తెలంగాణలో ఐపీఎస్ లకు పదోన్నతులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు దేవినేని ఫేమ్ శివనాగు, ఖమ్మం జిల్లా ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కేకును కట్ చేసి అభినంధనలు తెలిపారు. అలాగే నూతన సంవత్సర సందర్భంగా నందమూరి బాలకృష్ణ యువసేన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మరియు సినీ దర్శకులు మాట్లాడుతూ అఖండ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఇలాంటి సినిమాలు బాలకృష్ణ కి ఎన్నో విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు అభిమానులకు మునుముందు మరెన్నో మంచి సినిమాలు తీయాలని వారు డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కోరారు . హ్యాండీ క్యాప్ రాము కి ఈ సందర్బంగా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో మధు తారక్ బాలాజీ, చంద్రశేఖర్, సతీష్, నాగు, రాజా, ప్రవీణ్, తిరుమల రావు, దాసరి నాగ, సాయితేజ, అనిల్, వీరన్న, రాము, మహేంద్ర ఉదయ్, బెజవాడ రవి, సింహాద్రి, శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు