Telugu News

చదువుకున్న బడికి చేయూత

కూసుమంచి ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థుల చేయూత...

0

చదువుకున్న బడికి చేయూత

== కూసుమంచి ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థుల చేయూత…

== పది కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటుకు సహాకారం

( కూసుమంచి-విజయంన్యూస్)

తాము చదువుకున్న పాఠశాలకు చేయూత నిచ్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. శనివారం రావిచెట్టు తండాకు చెందిన పూర్వ విద్యార్థులు  అన్నదమ్ములు   తేజావత్ వెంకట్రామ్ ఈఈ (ఇరిగేషన్), భద్రు (రైల్వే డివిజనల్ మేనేజర్), తేజ  (సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లండన్) శనివారం కుటుంబ సమేతంగా కూసుమంచి ఉన్నత   పాఠశాలను సందర్శించారు.

allso read- ‘పాలేరు’ బరిలో తమ్మినేని

ఈ సందర్భంగా  చదువుకున్న రోజుల్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు . వారు మాట్లాడూతూ… తాము  తాము చదువుకున్న రోజుల్లో ఇన్ని అవకాశాలు లేవని ఇప్పుడున్న  అవకాశాలను వినియోగించుకోని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. హాస్టల్ ఉండి పురుగుల అన్నం కూడా తిని కష్టపడి చదువుకున్నామని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి ఈ స్థాయి వచ్చామని వివరించారు. ఎటువంటి ప్రోత్సాహం లేకున్నా విజయం సాధించామన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయినా కూడా రెట్టించిన ఉత్సాహంతో చదివి ఈ స్థాయికి చేరామన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనే దానికి తామే నిదర్శనమన్నారు. విద్యార్థుల కోసం పాఠశాలలో 10 కంప్యూటర్లతో  లాబ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులు పాఠశాల తరుపున విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రేల విక్రమ్ రెడ్డి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.