Telugu News

జీళ్ళచెరువు లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ చాలీసా పారాయణము, సంకీర్తన చేసిన భోజనం బృందం 

0

జీళ్ళచెరువు లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

== హనుమాన్ చాలీసా పారాయణము, సంకీర్తన చేసిన భోజనం బృందం 

(కూసుమంచి -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు నిర్వహించారు.. స్థానిక భక్తభజన మండలి ఆధ్వర్యంలో ఏకనామం హరేరామ..హరేరామ..రామరామ హరేహరే..హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరేహరే, సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణము చేయగా, అర్చకులు చిలకమర్రి స్వామినాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకాలు చేసి, హోమంతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో అయితగాని చిన్న నరసింహారావు, గోగుల అంజయ్య, పెండ్ర అంజయ్య, మల్లెల రవి, చెన్నా వెంకన్న, చెన్నా విజయ్, చెన్నా విరభద్రం, బొడ్డు నరేందర్, ఉరుకొండ బాను, మెట్టెల విజయ్, కొండపల్లి రాములు, చెన్నా ఎల్లయ్య, ముద్రబోయిన నాగేశ్వరరావు, దంతాల కోటయ్య, అంబాల చిన్న సైదులు, ముద్రబోయిన ఉపేందర్, తమ్మరబోయిన నాగేశ్వరరావు, ఐడియా సాయి, బాలబోయిన గోపి, కిన్నెర ఉప్పలి, చేగొమ్మ చారి, ముద్రబోయిన కృష్ణ, మామిళ్ళపల్లి రామాచారి, కొండా వెంకటనారాయణ, పోతురాజు, ఐతగాని నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.