అంకిత భావానికి ప్రతీక హనుమాన్ జయంతి : మంత్రి
బైపాస్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంకిత భావానికి ప్రతీక హనుమాన్ జయంతి : మంత్రి
== బైపాస్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి అని, ఆంజనేయుని ఆశీస్సులు అందరపై ఉండాలని కోరుకుంటున్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఖమ్మం పర్ణశాలలోని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్ఆర్ నగర్ కాలనీ లోని హజుమన్ జయతి సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం కు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
అనంతరం బైపాస్ రోడ్డు 10వ డివిజన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రామ భక్తంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హజరై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి పువ్వాడకు స్వాగతం పలుకగా వేద మంత్రఉచ్చరణలతో అభిషేకం చేసి స్వామి వారి నాభిశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. యాగశాలలో చేపట్టిన యాగఆహుతి, ప్రత్యేక పూజా కార్యక్రమంలోపాల్గొన్నారు. పవిత్ర జలాలు, పంచాంబృతలు, వడమాల, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం క్షీరాభిషేకం చేశారు. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.. 30వేల మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహాఅన్నదానం ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హనుమంతుని జీవితం, ఆదర్శభావాలు మనకు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. సంకట విమోచనుడు అందరి కష్టాలను తొలగించి, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రజలందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నా అన్నారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల నుంచి బయట పడి, ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమంతుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేటర్ చావా మాధురి నారాయణ రావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మయోర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు సరిపుడి రమాదేవి సతీశ్, రవి, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, షకీన, ఏచ్చు ప్రసాద్, సురేష్, మోహన్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?