Telugu News

ఏన్కూరులో ఘనంగా హనుమాన్ జయంతి

0

ఏన్కూరులో ఘనంగా హనుమాన్ జయంతి

ఏన్కూరు, జూన్ 1(విజయం న్యూస్):

(రిపోర్టర్ -చారి)
మండల వ్యాప్తంగా శనివారం హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.హిమాంనగర్,ఏన్కూరు,గార్లఓడ్డు,టి ఎల్ పేట,నాచారం,లచ్చగూడెం, రాజలింగాల,తిమ్మరావుపేట,కేసుపల్లి తదితర గ్రామాల్లోని దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.పంచామృతాలతో అభిషేకం,విశేష అలంకరణ, వెయ్యి తమలపాకులతో సహస్రనామార్చన,వడమాల సేవ, హనుమాన్ చాలీసా పారాయణం,నీరాజనం,మంత్రపుష్పములు తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.