Telugu News

చిన్నారులకు అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు౼మంత్రి పువ్వాడ.

సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు.

0

చిన్నారులకు అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు౼మంత్రి పువ్వాడ.

◆ సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు.

◆ ఇటీవలే నీలోఫర్ హాస్పిటల్ లో ప్రత్యేక శిశు విహార్ వార్డు ప్రారంభం.

◆ ఖమ్మంలో ప్రత్యేకంగా మాతా శిశు కేంద్రం.

పిల్లలు దేవుడి ప్రతి రూపాలు… నిష్కల్మశమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలు… ప్రేమకు పాత్రులు..ఇలాంటి చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, బాల్యాన్ని పిల్లలు ఆనందంగా, అద్భుతంగా గడిపేలా దోహదపడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

నవంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా చిన్నారులకు మంత్రి శుభాకాంక్షులు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల రక్షణ కల్పనకు, వారి భవితవ్యాన్ని బంగారుమయం చేసేందుకు, వారి భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో బాలల కోసం ప్రత్యేకమైన హోమ్స్, బాలల హక్కుల రక్షణ.