Telugu News

ఘనంగా రంజాన్.

ఏన్కూరు విజయ్ న్యూస్

0

ఘనంగా రంజాన్.

(ఏన్కూరు విజయ్ న్యూస్):-

మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు మంగళవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏనుకూరు, గార్లఒడ్డు, బి ఆర్ పురం, తిమ్మారావుపేట, రేపల్లెవాడ,జన్నారం తదితర గ్రామాల్లో రంజాన్ పండుగను ఘనంగా జరిపారు పండుగ సందర్భంగా మసీదులను అందంగా అలంకరించి ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలై బలై తీసుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సేమియాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాల్లో సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు,ఎస్ఐ సాయికుమార్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు