Telugu News

*ఘనంగా సెమి క్రిస్మస్.. పాల్గొన్న మంత్రి పువ్వాడ..

◆ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

0

*ఘనంగా సెమి క్రిస్మస్.. పాల్గొన్న మంత్రి పువ్వాడ..

◆ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో మండల పోస్టర్స్ ఐక్య వేదిక అధ్యక్షుడు ఎం.సంజీవరావు ఆద్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మనం ఏ మతం నైన స్వేచ్ఛగా ఆచరించవచ్చు అని మంత్రి పువ్వాడ అన్నారు. ఒకే పండుగను యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునేది క్రిస్మస్ అని పేర్కొన్నారు.

క్రీస్తు పుట్టినరోజు అయిన క్రిస్మన్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం క్రిస్మస్ పండుగను ప్రతి ఇళ్ళు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అభివృద్ధిలో భాగంగా ఖమ్మం చర్చ్ కాంపౌండ్ సర్కిల్ ను సుందరంగా తీర్చిదిద్ది అక్కడ క్రీస్తు సిలువను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో పాస్టర్స్ తిమోతి, ఆదాం బెన్నీ గారు, జీవరత్నం, వేముల సత్యం గారు, మండల జడ్పీటిసి ప్రియాంక గారు, ఎంపిపి గౌరీ గారు, సర్పంచ్ లు ప్రదీప్ గారు, లలిత గారు, నాయకులు కుర్రా భాస్కర్ రావు గారు, మందడపు నర్సింహారావు గారు, సుధాకర్ గారు తదితరులు ఉన్నారు.

also read ;-కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ…