Telugu News

ఏన్కూరులో చంద్రబాబు విడుదల పట్ల హర్షం

0

 ఏన్కూరులో చంద్రబాబు విడుదల పట్ల హర్షం

== ఏన్కూరులో సంబరాలు

ఏన్కూరు, అక్టోబర్ 31(విజయం న్యూస్):

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల పట్ల మండల టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి మంగళవారం ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడం పట్ల టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఏన్కూరు ప్రధాన సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కోనకంచి రామకృష్ణ, ఎంపీపీ ఆరేం వరలక్ష్మి, మాజీ జెడ్పిటిసి కోపెల శ్యామల, నాయకులు ఆరెం రామయ్య, తాళ్ళురి అప్పారావు, మేడ ధర్మారావు, కోపెల రామారావు, వేముల రమేష్, జనార్ధన్, సాయిలి నాగయ్య, పాండు, లక్ష్మణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:-;“చంద్రబాబు” నేడే విడుదల