ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
★ కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్
(ఖమ్మం విజయం న్యూస్):-
ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా కార్మికులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యమైందని మంత్రి అజయ్ పేర్కొన్నారు.దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. మేడే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కృషి చేస్తున్నామని మంత్రి అజయ్ చెప్పారు. ఆదర్శవంతమైన కార్మిక, కర్షక, విధానాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
also read:-పట్టా భూముల ముసుగులో జీరో ఇసుక దందా
టీఎస్‌ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసిఆర్ బతికించారని, తెలంగాణ లాంటి పరిస్థితి వేరే రాష్ట్రంలో ఉంటే ఎప్పుడో మూతపడేసేవారని ప్రతి నెల ఒకటో తేదీన కార్మికులకు వేతనాలు అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచి మున్సిపల్ కార్మికుల సేవలకు గౌరవాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కొనియాడారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.