Telugu News

అదనపు కట్నం కోసం వేధింపులు

?మహిళా మోసం చేసిన ఐటిసి కాంట్రాక్టర్

0

అదనపు కట్నం కోసం వేధింపులు

 

?మహిళా మోసం చేసిన ఐటిసి కాంట్రాక్టర్

 

?నిత్య పెళ్లి కొడుకని ఆరోపణలు చేస్తున్న బాధితురాలు

 

?ఐటీసీ గేటు ముందు నిరసన తెలిపిన మహిళా

 

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

మహిళలంటే ఆట బొమ్మలుగా,కేవలం వాడి పడేసె వస్తువులు గా కొందరు దుర్మార్గులు మహిళలకు అన్యాయం చేస్తూ వారి ఆగడాలు సాగిస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుంటూ కొన్ని రోజులకే వారిని వదిలేస్తూ మరో పెళ్లికి సిద్ధపడుతు నిత్య పెళ్ళి కొడుకులుగా చాలామని అవుతున్న ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నారు. అటువంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటీసీ గెట్ ముందు చోటు చేసుకుంది.భద్రాచలం శాంతి నగర్ కు చెందిన వాసు నాగేంద్ర అనే వ్యక్తి ఐటీసీ కర్మాగారంలో బడా కాంట్రాక్టర్ గా చలామణి అవుతూ మాయ మాటలు చెబుతూ రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న తన ఇటీవల పెళ్లి చేసుకున్న వెంకట లక్ష్మి అనే బాధిత మహిళ తన ఐటీసీ గెట్ ముందు నిరసన చేస్తూ తన ఆవేదన ను తలియజేసింది.

also read;-మహబూబబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

మాయగాడి మాటలకు మోసపోయి పెళ్లి చేసుకున్నందుకు నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసినట్లుగా అతను కాంట్రాక్టు పోతుందని అందుకు తను వ్యభిచారం చేయాలని ప్రోత్సహించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిని తీసుకురావాలని లేని పక్షాన తను ఏలుకో నంటూ మాయగాడు వెంకట లక్ష్మి అనే మహిళ ను వేధించినట్లు గా ఆమె గురువారం నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు వివరించారు తనకు న్యాయం చేయాలని వేరే మహిళలకు ఇటువంటి అన్యాయం జరగకూడదని తన రోడ్డు మీదకు వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నట్లు ఆమె తన గోడును వెళ్లబోసుకున్నారు. బడాబాబులు అతనికి మద్దతు తెలియజేస్తున్నారు. అందుకే ఆయన ఇష్టానుసారంగా గిట్ల పెళ్లిళ్లు చేసుకుంటూ మహిళ మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు తనకు న్యాయం చేయాలని న్యాయం చేసే వరకు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారని పోలీసులకు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు సమీపంలో మహిళా బాధితులు నిరసన వ్యక్తం చేశారు.తనని వాసు నాగేంద్ర అనే వ్యక్తి మోసం చేసాడంట్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుపెళ్ళి నాడు తీసికున్న ఫోటో ల తో నిరసన ప్రదర్శన చేసారు.అదనపు కట్నం కోసం వేధిస్తున్నతన భర్త ఇంటిముందు బుధవారం దీక్ష చేపట్టిన మహిళ.మోసగాడు అక్కడ నుంచిపరార్ కావడంతో ఐటీసీ గేటు ముందు నిరసన గురువారం ఉదయం వ్యక్తం చేపట్టిన బాధిత మహిళ.తనతల్లిదండ్రులు ఆస్తి అమ్మి అదనపు కట్నం డబ్బులు తెస్తేనే తిరిగి కాపురానిక రానిస్తానని వేధిస్తున్న భర్త నాగేంద్ర వేధింపులు తట్టుకోలేక రోడ్డు ఎక్కినట్లు ఆవేదన వ్యక్తంచేశారు.

also read;-నేటి నుంచి గార్లఒడ్డు లో బ్రహ్మోత్సవాలు.
విషయం తెలుసుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలు కు నచ్చేచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె తనకి న్యాయం చేయాలని వేడుకున్నారు. నాకు జరిగిన అన్యాయం వేరే ఎవరికి జరగకూడదని ఆమె అన్నారు.భద్రాచలం పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన వాసు నాగేంద్ర అనే వ్యక్తి వెంకట లక్ష్మి అనే యువతిని 2 నెలల క్రితమే పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని వెంకటలక్ష్మి అనే మహిళ తన గొడు వెళ్లబోసుకున్నారు.వాసు నాగేంద్ర ఐటీసీ సెక్యూరిటీ విభాగం లో కార్ కాంట్రాక్టర్ గా వ్ తనకి న్యాయం చేస్తామని పోలీసులు హామి ఇచ్చారు.పోలీసులుఆమెని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఏది ఏమైనా నా ఒక మహిళ అ తనకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన ఈ క్రమంలో అధికారులు స్థానికులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు న్యాయం చేయాలని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళకు ఎటువంటి న్యాయం జరుగుతుందో మోసం చేసిన ఎటువంటి శిక్ష పడుతుందో తెలియాల్సి ఉంది.