Telugu News

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

కామేపల్లి మండలం బాసిత్ నగర్ గ్రామంలో భర్త, అత్తింటి వేధింపులు తాళలేక గీత (28) వివాహిత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది

0

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

(కామేపల్లి – విజయం న్యూస్)

కామేపల్లి మండలం బాసిత్ నగర్ గ్రామంలో భర్త, అత్తింటి వేధింపులు తాళలేక గీత (28) వివాహిత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన కామేపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.రఘునాధపాలెం మండలం జింకలతండా గ్రామానికి చెందిన బానోతు గీత(28) కు కామేపల్లి మండలం బాసిత్ నగర్ గ్రామానికి చెందిన భాణోత్ రామదాసు తో గత 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

also read :- 108లో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం

గత ఆరు సంవత్సరాల నుండి భర్త రామదాసు, అత్త రుక్కీ, మామా సేట్ రాంలు కి తరచుగా మృతురాలు గీత ను శారీరకంగా, మానసికంగా వేధించగా తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలికి ఒక పాప ఒక బాబు ఉన్నారు.మృతురాలి తల్లి దారావత్ బుజ్జి తన కూతురు ఆత్మహత్య కారకులైన భర్త, అత్తమామల పై ఫిర్యాదు చేయగా కామేపల్లి ఎస్ ఐ బి. లక్ష్మీ భార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

also read :- ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య..