బీజేపీకి ఇక గడ్డుకాలమే: ఎండీ.జావిద్
== రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
== హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలే తెల్చి చెప్పాయి
== అక్కడ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పారు
== పీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఇక నుంచి బీజేపీ ప్రభుత్వానికి, పార్టీకి గడ్డుకాలమేనని, రాబోయే ఎన్నికలన్ని కూడా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికళ్లా ఫలితాలు ఉంటాయని పీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లోదేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు చేశారు. టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని పరస్పర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
allso read- హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ ఫలితాలు
ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు ఎండీ.జావిద్ మాట్లాడుతూ భారత్ జూడో యాత్రకు భారతదేశ ప్రజలు ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రూపంలో మొట్టమొదటి విజయం లభించిందని, ఈశాన్యంలో మొదలైన ఈ విజయోత్సవ ప్రభంజనం రాబోవు ఎన్నికల్లో దేశమంతటా వ్యాపింపజేసి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను కాపాడే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి భారత దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుటలో కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, మల్లు భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే బాబా, రఘునాథ పాలెం మండల నాయకులు భూక్యా బాలాజీ, మారం కరుణాకర్ రెడ్డి, కొంటేముక్కుల నాగేశ్వర రావు, మాజీ సర్పంచ్ రేమల్లే రమేష్, కిలారు వెంకట రమణ,మైనారిటీ సెల్ నగర అధ్యక్షులు Sk అబ్బాస్, బిసి సెల్ నాయకులు గజ్జెలీ వెంకన్న, మైనారిటీ వర్కింగ్ ప్రెసడెంట్ సయ్యద్ గౌస్, 46 డివిజన్ అధ్యక్షులు షేక్ రజ్జి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జహీర్, మెహ్మోధ్ ముజాహిద్, పాషా, అబ్దుల్ అహద్ ,సక్రు, ఫరూక్, కైసర్, షారూక్, రియాజ్, పెరం యశ్వంత్ వర్ధన్, అరిష్ తది తరులు పాల్గొన్నారు..
allso read- ఇక ప్రధాని మోడీకి మూడింది: భట్టి విక్రమార్క