Telugu News

రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్..

పంద్రాగస్టు రోజున రుణమాఫి ఇస్తే నేను రాజీనామా చేస్తా..?

0

రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్..

== పంద్రాగస్టు రోజున రుణమాఫి ఇస్తే నేను రాజీనామా చేస్తా..?

== చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా

== ఉత్తర మాటలు మాని నిజాలు చెప్పండి

== బీఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు

== ఖమ్మంలో మాజీ మంత్రి హరీష్ రావు

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సవాల్ విసిరారు. పంద్రాగస్టు నాటికి  రుణమాఫీ చేసి, ఆరు పథకాలను అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హారిష్ రావు సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్దకు రావాలని అక్కడ ప్రమాణం చేసి సవాల్ కు సిద్దం కావాలని డిమాండ్ చేశారు. ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్ లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తేనీరు హారిష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు.

ఖమ్మం BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు నామినేషన్ అనంతరం సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన పార్లమెంటరీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు హాజరై మాట్లాడారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ అభ్యర్థి నామా నామినేషన్ 

*▪️హరీష్ రావు కామెంట్స్..*

4 నెలల కాంగ్రెస్ పాలనలో ముఠా రాజకీయాలు, తిట్లు, ఓట్లు జరుగుతున్నాయి.

ఖమ్మం ప్రజలు తాగునీరు రాక, రైతులు సాగు నీరు రాక ఇబ్బంది పడుతుంటే వీరు మాత్రం టికెట్ల కోసం ఢిల్లీ కి వెళ్తున్నారు.

ఖమ్మం జిల్లాలో నీటి ఎద్దడి రావద్దని ఖమ్మంకు సీతారామ ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించాం.

రేపటికి నామినేషన్ లు పూర్తి అవుతాయి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోలేదు. ఎవరికి ఇవ్వాలో వారిలో వారే కొట్టుకుంటున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో.

కాంగ్రెస్ అభ్యర్థిగా పూటకు ఒక పేరు వస్తుంది, ఈ జిల్లా వారే కాకుండా బయట వారిని కూడా తీసుకుని వస్తా అంటున్నారు.

కాంగ్రెస్ వస్తె మార్పు వస్తుందని అనుకుంటే ఈ జిల్లాలో ముగ్గురికి మాత్రమే నౌకరీ వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారు, అది దిగాలి అంటే నామా నాగేశ్వరరావు ను ఎంపీగా గెలిపించాలని.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నారు.. విస్మరించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ మరిచి తిరిగి ఓట్లు అడిగేందుకు ప్రజల మధ్యకు వస్తున్నారు.

కాంగ్రెస్ పాలనలో బస్సు మినహా అంతా తుస్సే.. ఏమైంది మీ హామీలు.. ఏమైంది మ్యానిఫెస్టోలో ఇచ్చిన పథకాలు.. అసలు వస్తాయా అన్న సందేహం ప్రజల్లో వచ్చేసింది.

కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తుక్కు తుక్కుగా ఓడిస్తారని దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాండు పేపర్ లు తీసుకు వస్తె వాటి మీద నమ్మకం ఉండే, కాంగ్రెస్ కారణంగా వాటి మీద నమ్మకం పోయే.

రేవంత్ రెడ్డి.. ఆగస్టు 16 తేదీ లోపు రుణమాఫీ చేస్తావా, చేయవా ప్రజలకు తెలియజేయాలి, చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఏదో ఒకటి చేయి.

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటు వేయరు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు పించన్ రూ.4 వేలు వేస్తా అని ఇవ్వలేదు. ప్రజలకు బాకి ఉన్నారు.

రాష్ట్రంలో మహిళలందరికీ రూ.2500 ఇస్తా అన్నావ్ ఇవ్వలేదు, రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ రూ.10 వేలు బాకీ పడింది.

కాంగ్రెస్ తీరు ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఉంది.

ప్రజలు మోసపోతారు అని రేవంత్ రెడ్డి బహిరంగంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ ప్రజలు ప్రతిసారి అలా మోసపోరు రేవంత్ రెడ్డి అది గుర్తు పెట్టుకోండి.

ఖమ్మంలో తాగునీరు బురద నీళ్ల వలే వస్తున్నాయి, అంటే కాంగ్రెస్ పరిశుద్ధ నీటిని అందించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది.

కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. ప్రజలు కేసిఆర్ వైపు, మీ వైపు చూస్తున్నారు, ప్రజలకు కాంగ్రెస్ అబద్ధాలు, మోసాలను చెప్పండి.

కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటిలను అమలు చేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఒడిస్తారు.

కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని దించాలంటే వారిని ఓడించాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో మెడలు వంచి గ్యారెంటిలను అమలు చేసేలా చేస్తాం.

కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడినా ప్రభుత్వమేమీ పడిపోదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు.

కాంగ్రెస్ పార్టీవి అన్ని బోగస్ మాటలే. గ్యారెంటీ లను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు పూర్తి సమయం దాటిపోయిన వాటిని అమలు చేయలేదు. చేయలేదు కూడా.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు వెళ్ళండి మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు.

ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అప్పటికి మిమ్మల్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సహకారం అందిస్తుంది.

సీపీఎం, సీపీఐ నాయకులు రేవంత్ రెడ్డి మొన్న కేరళ వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని మోడీ ఏజెంట్ అన్నా, మీరెందుకు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారో అర్దం కాట్లేదు.

రాహుల్ గాందీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు.. రాహుల్ గాందీ అదాని ని చోర్ అంటారు, రేవంత్ రెడ్డి అదాని మంచివాడు అంటారు.

రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని భాయ్ అంటారు, నరేంద్ర మోడీని బడే భాయ్ అంటారు. అంటే మళ్ళీ తిరిగి మోడీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా..?

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడ లేరు, టీడీపి, బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది మైనార్టీ మంత్రులు ఉన్నారు.

రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి భయపడి ఒక్క మైనార్టీ మంత్రికి అవకాశం ఇవ్వలేదు. ముస్లిం సోదరులు గమనించాలి.

రేవంత్ రెడ్డి తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చెప్పుకుంటారు, ఆయన ఎప్పుడైనా బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కు ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు లక్ష పెళ్ళిళ్ళు అయ్యాయి, రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష తులాల బంగారం బాకీ పడింది.

4 నెలలకే కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను ఇంతలా ఇబ్బందులకు గురి చేస్తే, ఇంకా 4 ఏళ్లు ప్రజలను ఇంకా ఎంత ఇబ్బందులకు గురి చేస్తారో చూడాలి.

ఖమ్మం జిల్లాలో సగం మంది పంటలు వేయలే, వేసిన సగం మంది పంటలు ఎండిపోయాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నిలం తుఫాన్ వస్తె వరంగల్ కు ఇచ్చి ఖమ్మం రైతులను విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి రైతులకు నష్టపరిహారం అందించాం. దాదాపు రూ.500 కోట్లు పరిహారం అందించింది brs ప్రభుత్వం.

లంబాడీల కు, గిరిజనులకు కేసిఆర్ ప్రభుత్వంలో పోడు భూములు ఇచ్చాం, సత్యవతి రాథోడ్ కు మంత్రి పదని ఇచ్చారు, మి క్యాబినెట్ లో ఏ ఒక్క లంబాడి మంత్రి అయినా ఉన్నారా..?

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా కేటాయించలేదు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని మోత్కుపల్లి నర్సింహులు స్వయంగా నిరసన తెలిపారు.

కాంగ్రెస్ తప్పిదాల కారణంగా రాష్ట్ర ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రజా పాలన అని సిఎం ఒక్కరోజు ప్రజలను కలిసి ఆ తరువాత గేట్లు వేపించారు.

కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటినాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదు.

మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ఊరంతా చుట్టి వచ్చినాయి, మన నిజం మాత్రం గడప కూడ దాటలేదు. చెప్పుకోవడంలో మనం విఫలం చెందినం.

కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టేందుకు ప్రజలు మే 13 కోసం ఎదురు చూస్తున్నారు.

మన పార్టీని వీడి ఎంపీ గా పోటీ చేస్తున్న నలుగురు నాయకులు 3వ ప్లేస్ కి పడిపోయారు.

నామా నాగేశ్వరరావు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఖమ్మం జిల్లాకు ఇవ్వాలని కోరగా, కేసిఆర్ బీసీ బిడ్డ గాయత్రీ రవికి ఇచ్చారు.

నామ నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించండి, నామా గెలుపు అభివృద్ధికి మలుపు.

*▪️మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కామెంట్స్..*

పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం మన పార్టీకి ముఖ్యమైన ఎన్నికలు.

బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం అత్యధిక మెజారిటీతో గెలుపొందేందుకు మనం కృషి చేయాలి.

తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కారణంగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళింది.

కాంగ్రెస్ పార్టీ పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా కావాలని ఆపారు.

ఏదైనా అడిగితే ఎన్నికల కోడ్ వచ్చిందని అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని సాకులు చెప్తున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో వినిపించాలి అంటే నామా నాగేశ్వరరావును గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.

*▪️రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారి కామెంట్స్..*

నామ నాగేశ్వరరావు గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు మన వద్దకు వచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం.

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని బస్సు యాత్ర మొదలు పెట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు పిల్లర్లు పాడైతే వాటిని మరమ్మతులు చేయాల్సింది పోయి నీరు మొత్తం సముద్రంలోకి విడిచి పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామని తల పట్టుకుంటున్నారు.

నామ నాగేశ్వరరావును కేసిఆర్ తిరిగి మళ్ళీ లోక్ సభ పక్ష నేతగా నియమించారు.

లోక్ సభలో ఏ రోజు బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్రం తరపున మాట్లాడలేదు.

బీఆర్ఎస్ బీజేపీకి ఏ రోజు బీ టీం గా లేదు, అలా ఉంటే కవిత జైల్ లో ఉండేది కాదు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. 2014 లో జిల్లా నుండి ఒక్కరే గెలిచారు, 2018 లో జిల్లా నుండి ఒక్కరే గెలిచారు అయిన కేసీఆర్ ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అత్యాధిక నిధులు కేటాయించారు.

మన పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధిస్తుంది అందులో నామా నాగేశ్వరరావు కూడా ఉంటారు.

*▪️బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి కామెంట్స్…*

మొన్న ఎన్నికల్లో మనం ఊహించని తీర్పును ప్రజలు ఇచ్చారు. మన నాయకుడు కేసిఆర్ బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేస్తూ వెళ్ళారు, కానీ ప్రజలు దానికి భిన్నంగా తీర్పు ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో మనమంతా కలిసి మెలిసి పని చేద్దాం అలా చేస్తే విజయం మనల్ని వరిస్తుంది.

బీఆర్ఎస్ ఎంపీ లు పార్లమెంట్ కు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం మనకు ఇద్దరే ఎంపీ అభ్యర్థులు ఉంటే వారు పోరాడి మరీ తెలంగాణ సాధించాం.

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని సీఎంగా కేసిఆర్ దేశంలో ముందంజలో ఉంచారు.

మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు.

17వ లోక్ సభలో 4 బీజేపీ, 3 కాంగ్రెస్, ఒక్కరూ ఎంఐఏం ఉండగా తెలంగాణ గురించి పార్లమెంట్ లో ఏ ఒక్కరూ మాట్లాడలేదు.

నేను తెలంగాణ రాష్ట్ర ఎంపీ లను పార్లమెంట్ లో అడిగాను. మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. కాని వారు దానికి అంగీకరించలేదు.

నీళ్లు లేక రాష్ట్రంలో, జిల్లాలో ఎన్నో పంటలు ఎండిపోయాయి. అదే మన నాయకుడు సీఎంగా ఉండి అంటే అలా జరిగి ఉండేది కాదు.

మే 13 వరకు ఇది మన ఎన్నిక అని భావించి అంతా కలిసి పని చేస్తే మనం గెలవడం సునాయాసం అవుతుంది.

కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలన గురించి కేసిఆర్ 4 గంటల్లో కడిగి పారేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నాయకులను ఇబ్బందులకు గురి చేశారు.

మన పార్టీకి ఓకే ఒక రాజ్యసభ సీటు అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని ఖమ్మం బీసీ బిడ్డకు కేసిఆర్ ఇచ్చారు.

అందరం కలిసి పని చేసి మే 13 వరకు కష్టపడాలి.