Telugu News

హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

హరీష్ రావు జాగిరి కాదు, కేసీఆర్ జాగిరి అంతకన్నా కాదు

0

హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

==నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా చెయ్

== ఖమ్మం ప్రజల జిల్లా.. దొరల జిల్లా కాదు..

== హరీష్ రావు జాగిరి కాదు, కేసీఆర్ జాగిరి అంతకన్నా కాదు

== మంత్రి హరీష్ రావుపై మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== మధిరలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో హాజరైన భట్టి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మంత్రి హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు.. ఖమ్మం జిల్లా.. చాలా చైతన్యవంతమైన జిల్లా.. అలాంటి ఈ జిల్లాలో మీకు రెండు సార్లు మిగిలింది ఒక్క సీటే.. రాబోయే ఎన్నికల్లో అది కూడా మిగలదు.. నోటికోచ్చినట్లు మాట్లాడితే, మాయమాటలు చెబితే ఖమ్మం జిల్లా ప్రజలు వినరు..నమ్మరు కూడా.. నీ మామ దగ్గర నేర్చుకున్న మాటలను కట్టిబెట్టు అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావుపై మండిపడ్డారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సీఎల్పీ నేతభట్టి విక్రమార్క మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం..ఇక్కడ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రమని, దొరల రాష్ట్రం కాదని అన్నారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్న మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను ఒప్పించి మిగులు బడ్జెట్ తో  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పితే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పరిపాలనతో అవినీతి పరిపాలనో నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?

దేశంలోనే మేం నెంబర్ వన్ అంటూ గొప్పలు చెబుతున్న మంత్రి హరీష్ రావు కొతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా పరిపాలన చేస్తున్న మా మామ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రూ.5వేల కోట్ల అప్పులు పాలు చేశాడని, అందుకే దేశంలోనే నెంబవర్ వన్ అని ఎందుకు చెప్పడం లేదన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్ దనే  విషయాన్ని ఖమ్మం మీటింగ్ లో ఎందుకు చెప్పలేదన్నారు. పైసలు లేక ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్న ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ అని ఎందుకు చెప్పడం లేదని విమ్మర్శించారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అమ్ముకోవడంలో మా మామ నెంబర్ వన్ అని ఎందుకు చెప్పవని ఎద్దేవా చేశారు. కాళ్ళేశ్వరం ప్రాజెక్టు పైసల కోసం కట్టామని, నీళ్లు వచ్చిన రాకపోయిన కోట్ల రూపాయల కరెంట్ బిల్లు రూపంలో జేబులేసుకోవడంలో దేశంలోనే నెంబర్ వన్ అని ఎందుకు చెప్పడం లేదని విమ్మర్శించారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరైనది కాదన్నారు. ప్రతిసారి మాట్లాడితే 90 సీట్లు మావే అంటారు, తెలంగాణ ప్రజలు రేపు తీర్పు చెప్పబోతున్నారని, పై పది సీట్లు వస్తాయో..రావో అది చూసుకోండని సూచించారు. హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా అని, నీ ఉడత ఊపులు ఇక్కడ చెల్లవని అన్నారు. నువ్వు వచ్చి ప్రారంభోత్సవానికో, శంకుస్థాపనలకు వచ్చి పోతావ్ నీకేం తెలుసు ఇక్కడ రాజకీయమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చెయ్ ముందుకు..చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా చెయ్.. అంతేకాని  ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, ప్రజలు తిరగబడతే ఉండలేవు నువ్వు, మీమామ అంటూ విమ్మర్శించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పిపుల్స్ సర్కార్ తథ్యం

ఖమ్మం రాజకీయం గురించి నీకెందుకు ఇక్కడ ఒక సీటు లేదు నీతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని సూచించారు. మాయ మాటలతో కెసిఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని అన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది,రేషన్ బియ్యం తో పాటు సరుకులు ఇచ్చామని తెలిపారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం కాదు కదా కనీసం ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ నీ మూసేసాడని ఆరోపించారు. పెరిగిన ఆదాయం పేదలకు అందాలి కానీ అన్ని పథకాల్లో కోతలు తప్పా అమలు శూన్యమని దుయ్యబట్టారు. గతంలోనే మేము 2 లక్షల రూపాయల తో బంగారు తల్లి పథకం చట్టబద్ధం చేశాం…కానీ నేడు కోతలతో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ అంటు రూ.1లక్ష ఇస్తూ గొప్పలు చెబుతన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చట్టం చేసిన బంగారు తల్లి పథకం ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ తో విత్తనాలు,ఎరువులు,వ్యవసాయ పని ముట్లు,పంటల రాయితీ ఇలా అన్ని ఇచ్చాం కానీ వాటిని ఇవ్వకుండా రైతు బంధు అంటున్నాడు, ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలన్నారు. మనకు రాయతీల పేరుతో లక్షలు రావాల్సి ఉండగా, కేవలం 10వేలకే పరిమితం చేస్తున్నాడని, ఆయనిచ్చే రూ.10వేలకు ఆయన చేసే మోసాన్ని ప్రజలందరు గుర్తించాలని సూచించారు. కానీ కాంగ్రెస్ రాగానే ఇవ్వన్నీ ఇస్తూ,రైతు బంధు రూ.15వేలు ఎకరాకు ఇస్తామని,కౌల్ రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం,కూలీలకు కూడా కూలీ బంధు 12 వేయిలు ఇస్తామని హామినిచ్చారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గలాట

అందరికీ ఇండ్లు,ఇళ్ళ స్థలాలు ఇస్తాం, రూ5 లక్షల ఇండ్ల సహాయం ఇస్తామని స్పష్టం చేశారు. ఇలా కెసిఆర్ చేసిన అమలు చేయలేని మోస పూరిత హామీలు ప్రజలకు వివరిస్తూ…రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లు ఇంటింటికీ తిరిగి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కచ్చితంగా అమలు చేస్తుంది అని గ్యారంటీ కార్డులు ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గృహలక్ష్మి పేరిట మరొక మోసం చేయడానికి,మరోసారి మోసానికి తెరలేపిన కెసిఆర్, రెండు పడకల ఇండ్లు అన్నాడు,5 లక్షలు అన్నాడు,స్థలం ఉంటేనే ఆఖరికి 3 లక్షలు అంటున్నాడని విమ్మర్శించారు.  కెసిఆర్ ను నమ్మి మీరు గృహలక్షి పేరిట ఇండ్లు నిర్మాణానికి పూనుకుంటే, కేవలం గుంటలే మిగులుతాయని ప్రజలకు సూచించారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని,  ఏ ఊరులో కూడా ఇల్లు లేని వారు లేకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, బుల్లెట్ బాబు, ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు