Telugu News

నేడు ఖమ్మం జిల్లాకు హారీష్ రావురాకా

== జిల్లాలో ఇద్దరుమంత్రుల పర్యటన == పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రులు శ్రీకారం == ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

0

నేడు ఖమ్మం జిల్లాకు హారీష్ రావురాకా
== జిల్లాలో ఇద్దరుమంత్రుల పర్యటన
== పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రులు శ్రీకారం
== ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలకు శుక్రవారం ఇద్దరు మంత్రులు పర్యటిచనున్నారు. వైద్యారోగ్య, ఆర్ధిక శాఖల తన్నీరు మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10:00 గంటలకు మంత్రి తన్నీరు హారీష్ రావు ఖమ్మంకు చేరుకోగా ముందుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్‌ను, ట్రామా కేర్ యూనిట్ లను మంత్రులు ప్రారంభించనున్నారు.

అక్కడే ఆసుపత్రిని పరిశీలించి, వైద్యులు, రోగులతో మాట్లాడనున్నారు. అనంతరం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10:45 గంటలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యారోగ్య శాఖ ఉన్నాధికారులతో మంత్రులు సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మంత్రి పువ్వాడ నివాసంలో భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు మధిర మండలం అత్కురు గ్రామంలో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మాణం చేసిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి ఇద్దరు మంత్రులు ప్రారంభిస్తారు.

also read :-ఈనెల 28న ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’´

అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, కృషితో మధిర నియోజకవర్గానికి మంజూరైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 3:10 గంటలకు మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేయనున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గానికి ఇటీవల మంజూరైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్తానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం సత్తుపల్లి మండలం నారాయపురంలో శిరిడి సాయి ఆసుపత్రికి శంకుస్తాపన చేయనున్నారు. రాత్రి సత్తుపల్లిలో భస చేయనున్న తన్నీరు హారీష్ రావు, మరసటి రోజు మరో జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు గాను సంబంధిత అధికారులు, నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. పర్యటన ముగిసే వరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు మంత్రుల పర్యటనతో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

also read :- రాజ్యాంగ రక్షణ దేశ రక్షణ.