ఖమ్మం నియోజకవర్గం లో హాథ్ సే హాథ్ జోడో ప్రారంభం
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ప్రారంభం,
ఖమ్మం నియోజకవర్గం లో హాథ్ సే హాథ్ జోడో ప్రారంభం
== భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ప్రారంభం,
== దేశ సమైక్యత, సమగ్రత కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలి.
== దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను, చరిత్రను మరిచిపోకూడదు.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్ర అనుసంధానంగా భారత్ యాత్రలో విశ్లేషించిన విధంగా ఖమ్మం నియోజకవర్గంలో గురువారం హాథ్ సే హాథ జోడో కార్యక్రమం 32వ డివిజన్ శంకర్ నాయక్ నాయకత్వంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ ఈ యాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది.. ఏం చేయబోతుందో అవగాహణ కల్పించారు.
ఇది కూడా చదవండి: దళిత,గిరిజనులకు అండగా కాంగ్రెస్ జెండా: భట్టి
ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే హాథ్ సే హాథ జోడో అభియాన్(చేయి చేయి కలుపుదామ్ అభయాన్ని ఇద్దాం) అనే గడప గడప కు కార్యక్రమాన్ని ఆవిష్కరించి లాంచనంగా ప్రారంభించారు.ఫిబ్రవరి6న తెలంగాణ వ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం మొదలుకానున్నదని దానితో పాటుగా ఖమ్మం నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టనున్నామని తెలిపారు
== మురిసిన మువ్వన్నెల జెండా
గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు, పిసిసి మెంబర్ మహ్మద్ జావిద్ అవిష్కరణ చేశారు. గురువారం 74వ గణతంత్ర వేడుకల్లో భాగంగా పలు డివిజన్లో జాతీయ జెండా ఎగరేశారు దానిలో భాగంగా 46వ డివిజన్ అధ్యక్షుడు ఎస్ కే రజ్జి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన విలువైన రాజ్యాంగ నియమాలను పాటిస్తూ జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాలి అని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: నేనే రేడీ అంటున్న కోమటిరెడ్డి
ఈ కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు పువ్వళ్ళా దుర్గాప్రసాద్, పిసిసి నెంబర్ రాయల నాగేశ్వరరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ఓబీసీ టౌన్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, పాలకుర్తి నాగేశ్వరరావు (మాజీ కౌన్సిలర్), రెండో డివిజన్ నరసింహ రావు, 38 వాట్ ఇస్ సయ్యద్ గౌస్, ఖాదీర్, 40 వ డివిజన్ సయ్యద్ అబ్బాస్ ఆహాద్, గోపి, 23 వ డివిజన్ సయ్యద్ మహమ్మద్, రఫీ బాలాజీ నాయక్ రఘునాధపాలెం మండల బాధ్యులు, వి సురేష్, ఎండి మస్తాన్, టి మధు, ఎస్ కే జానీ, చల్లా రమేష్, బి శ్రీను, జీ రవి, టి శ్రీను,తుల్మాభిక్షం, టి వెంకన్న, రామకృష్ణ, హిమామ్ పాష, ఆసేన్, మల్లెల బిక్షం, ఎస్ కే నజీర్, ఎస్కే జహీర్, మహమూద్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.