Telugu News

తెలంగాణలో హ్యట్రిక్ విజయం తథ్యం:మంత్రి

అందరికి బీఫామ్ లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు

0

తెలంగాణలో హ్యట్రిక్ విజయం తథ్యం:మంత్రి

== అందరికి బీఫామ్ లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు

== ఖమ్మంలో అందరం గెలుస్తాం.. పదికి పది సాధిస్తాం.

== బీఆర్ఎస్ మేనిఫెస్టో పై రేవంత్ రెడ్డి పిచ్చి కూతలు మానాలి

== విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలోని అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని, 100 స్థానాలను గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగబోతుందని, హ్యాట్రిక్ విజయంతో సీఎం కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోస్యం చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ

ఇది కూడా చదవండి:- “నేనే బహుబలి”: మంత్రి పువ్వాడ 

15 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 51 మందికి బీఫామ్ లు ఇస్తే అందులో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులందరికి బీ ఫాంలు ఇవ్వడం జరిగిందని, మాపై నమ్మకం ఉంచి బీఫామ్ లను అందజేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారని అన్నారు. 201418 ఎన్నికల లాగా కాకుండా ఇప్పుడు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని సర్వేలుమేధావులు అంతా సీఎంగా కేసిఆర్ మూడవసారి విజయం సాధిస్తారు అని ఇప్పటికే వెల్లడించారని అన్నారు. సీఎం కెసిఆర్ ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సీట్లు గెలిచి బహుమతిగా ఇస్తామని, పదికి పది స్థానాలను కచ్చితంగా గెలుస్తామనిధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసుప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన అవుతున్నారని విమ్మర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని, అభివృద్ది వైపే నిలవాలని కోరారు.

ఇది కూడా చదవండి:- 51మందికి బీఫామ్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్

ఇతర జిల్లాలతో పాటు ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కెసిఆర్ ఖమ్మం జిల్లాకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచన చేయాలని, మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొదటి సారి 63రెండవసారి 84 సీట్లు సీఎం కెసిఆర్ అందించారని, మూడవ సారి 100 సీట్లను అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మా కార్యక్రమాలనుహామీలను కాపీ కొట్టింది. మేము కాపీ కొట్టలేదని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడికి బీఆర్ఎస్ మేనిఫెస్టో పై మాట్లాడే హక్కు లేదని, కాపీ కొట్టేవాళ్లకు మాట్లాడే అక్కు ఉంటుందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త..అదుపులో ఉండి మాట్లాడితే మంచిదన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఇచ్చిన పించన్ వందల్లోనే ఇచ్చిందని, దాన్ని వేలల్లో చేసింది సీఎం కేసిఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టింది. కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన చెప్పిందే చేస్తారన్నారు. మనం కూడా మన కుటుంబ సభ్యులకు భీమా చేపించం కానీ కేసిఆర్ భీమా అని పెట్టీన సీఎం కెసిఆర్ కు రాష్ట్ర ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కొనియాడారు. మంచి ఉంది అంటే దేశంలోప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము తీసుకుంటాం మంచిని మేము విమర్శించమని అన్నారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఇదే..|

మీరు మేనిఫెస్టో లో ప్రవేశపెట్టిన వాటిని మీరు నెరవేర్చలేదని,  మేము వాటిని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సీఎం కెసిఆర్ మూడవసారి విజయం అందించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనా ఉందన్నారు. మా అభ్యర్థులు అందరినీ కారు గుర్తుపై ఓట్ వేసి గెలిపించాలని కోరారు.

== దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది: నామా

అతిత్వరలో జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం ప్రజల ఆశీర్వాదం కోసం సీఎం కేసీఆర్ ఖమ్మం రానున్నారని, ఈనెల 27న పాలేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూడా దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.

కేసిఆర్ ను మూడవ సారి సీఎంగా ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసిఆర్ కు పేదలురైతులుకరెంట్నీటి కష్టాల విలువ తెలుసు కాబట్టి గొప్ప గొప్ప పథకాలు రాష్ట్రానికి అందించారని గుర్తు చేశారు. సీఎం కెసిఆర్  ప్రవేశ పెట్టిన పథకాలను పలు రాష్ట్రాలుకేంద్రం కాపీ కొట్టాయని అన్నారు. ఇప్పటికే దేశంలో కరెంట్ విషయంలో పర్ క్యపిటా లో మనమే నంబర్ వన్ గా ఉన్నామని గుర్తు చేశారు. కొన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవుఆ ఆలోచన కూడా ఇతర రాష్ట్రాల సీఎంలకు రావుని, అది సీఎం కేసీఆర్ కే స్వంతమని అన్నారు. గత 10 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీను మేము చూసి చూపాంఇప్పుడు ఇచ్చే హామీలను చేసి చూపుతామన్నారు.

ఇది కూడా చదవండి:- అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన సీఎం

60 ఏళ్లలో ఆ పార్టీ ఏమి చేసింది లేదు కానీ ఇప్పుడు ఆ పార్టీ వచ్చి 6 గ్యారెంటీలు అంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడుఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపి వద్దిరాజు రవి చంద్రఎమ్మేల్యే రాములు నాయక్బీఆర్ఎస్ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి)మధన్ లాల్(వైరా)లింగాల కమల్ రాజ్(మధిర)నాయకులు పగడాల నాగరాజు,ఆర్జేసీ కృష్ణమేయర్ పునుకొల్లు నీరజసుడా చైర్మన్ విజయ్ కుమార్ ఉన్నారు.