Telugu News

ఊరంతా కదిలారు.. రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు

స్వచ్చందంగా మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్న హట్యతండా వాసులు

0

ఊరంతా కదిలారు.. రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు
== సర్వీస్ రోడ్డు కోసం నెలల తరబడి నిరీక్షణ
== అయినా పట్టించుకుని అధికారులు
== స్వచ్చందంగా మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్న హట్యతండా వాసులు
== మా భూములు తీసుకుని మమ్మల్నే మోసం చేసారని అంటున్న గిరిజనులు
కూసుమంచి, అక్టోబర్ 23(విజయం న్యూస్)
ఓ గ్రామ వాసులు ఖమ్మం- సూర్యపేట జాతీయ రహదారి కోసం పదుల ఎకరాల భూములను ఇచ్చారు.. రోడ్డు నిర్మాణం చేశారు.. కానీ ఆ గ్రామ వాసులకు రవాణా సౌకర్యం ఇవ్వలేదు.. చిన్నపాటి వంతెనను నిర్మాణం చేసి మీ చావు మీరు సావండ్రా అంటూ వదిలేశారు.. కానీ వాళ్ల బ్రతికేది ఎలా..? వారు సాగు చేసిన పంటను ఎలా తరలించుకునేది.. హట్యతండాకు రావాలంటే 10కిలోమీటర్ల దూరం నుంచి పోయి నేషనల్ హైవే ఎక్కాల్సిన పరిస్థితి

ALLSO READ-  ‌వైరా మండలం రెబ్బవరంలో హత్య..  

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ శివారు హట్యతండా వాసులు ఆదివారం తమ తండాకు రవాణా సౌకర్యార్థం జాతీయ రహదారికి లింక్ చేస్తూ మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్నారు. ఊరు ఊరంతా కలిసి పారలు, పలుగులు తీసుకుని మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్నారు.. జాతీయ రహాదారికి ఇరువైపుల మట్టిని చదును చేసుకుంటూ హట్యతండా రైతులు, గిరిజనులు సుమారు 200 మీటర్ల దూరం పాటు రోడ్డును తయారు చేసుకున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, అంబులెన్స్ లు వచ్చే విధంగా మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణం విషయంలో ఊరుకు ఊరంతా వచ్చి పనులు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున నుంచి మట్టి రోడ్డు నిర్మాణ పనులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డుకు బీటీ రోడ్డు నిర్మాణం చేసి మా ఊరిని రక్షించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు, నేషనల్ హైవే అథారిటి అధికారులకు కోరుతున్నారు.
== సర్వీస్ రోడ్డు కోసం రెండు నెలలుగా
మల్లాయిగూడెం పంచాయతీ శివారు హట్యతండాకు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆ గ్రామ ప్రజలు, గిరిజన రైతులు గత రెండు నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. మొదటిగా జాతీయ రహదారి నిర్మాణ అధికారులకు వినతి చేశారు. ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ను కలిశారు. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఐదు నుంచి ఆరు గ్రామాల ప్రజలు సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తుందని, జాతీయ రహదారికి పైకి వచ్చేందుకు సర్వీస్ రోడ్డును నిర్మాణం చేయాలని కోరారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ALLSO READ- పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క

దీంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అక్కడికి వచ్చి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తానని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు రహదారి నిర్మాణ ఊసే చెప్పకపోవడంతో గ్రామస్థులందరు ఏకతాటిపై ఉండి రోడ్డుకు ఇరువైపుల తాత్కాలిక రోడ్డును తయారు చేసుకున్నారు.


== పైసలు లేకుండా పనులు
సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం గిరిజనులందరు ఐక్యమైయ్యారు. అందరు పార, పలుగు తీసుకుని వచ్చారు. మహిళలు, పురుషులు, యువకులుఅందరు రాత్రికి రాత్రే మట్టి రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టారు. జాతీయ రహదారికి అనుకుని రోడ్డుకు ఇరువైపుల తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మాణం చేశారు. అందు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోవడం గమనర్హం. అందరు పిల్లాపాపలతో రోడ్డు వద్దకు వచ్చి రోడ్డు నిర్మాణ పనులు చేశారు. ఇప్పటికైనా జాతీయ రహాదారికి అనుసంధంగా సర్వీస్ రోడ్డును నిర్మాణం చేయాలని వేడుకుంటున్నారు. తాత్కాలిక రోడ్డు వర్షం వస్తే కుంగిపోయే అవకాశం ఉందని, బీటీ రోడ్డు వేసి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో..?

== సర్వీస్ రోడ్డు ఇవ్వాలని రెండు నెలల నుంచి మొత్తకుంటున్నాం : బాదావత్ రవినాయక్, గ్రామస్థుడు
జాతీయ రహదారి నిర్మాణ సమయంలో సర్వీస్ రోడ్డును ఇవ్వాలని జాతీయ రహదారి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి చేశాము. అయినప్పటికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయలేదు. పైగా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా సర్వీస్ రోడ్డును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

 

== మా భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేసిండ్రు: నరేష్, గ్రామస్థుడు
జాతీయ రహదారి నిర్మాణానికి మా చక్కని భూములు ఇచ్చాము. అప్పుడు సర్వీస్ రోడ్డు కావాలని చెప్పాము.. కచ్చితంగా వేస్తామని జాతీయ రహదారి నిర్మాణం చేసే అధికారులు హామినిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ పని జరగలేదు. అందుకే ఊరుమొత్తం అందరు కలిసి మట్టి రోడ్డును నిర్మాణం చేసుకున్నాము.. మట్టి రోడ్డు వద్దని, అది ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉండదన్నారు. అందుకే బీటీ రోడ్డు నిర్మాణం చేస్తే ఐదు గ్రామాల ప్రజలకు సహయం చేసినవాళ్లు అయితారని అన్నారు.