Telugu News

రక్తదానం చేశాడు.. ప్రాణదాతగా నిలిచాడు..

మానవత్వం చాటుకున్న చిన్నపరెడ్డి

0
మానవత్వం చాటుకున్న చిన్నపరెడ్డి
👉రక్తదానం చేశాడు.. ప్రాణదాతగా నిలిచాడు..
👉అభినందిస్తున్న మండల ప్రజలు.
బూర్గంపహాడ్, డిసెంబర్ 06(విజయం న్యూస్ )
సోంపల్లి గ్రామానికి చెందిన అశ్విని అనే మహిళకు ఆపరేషన్ కు గంట ముందు బాదిత కుటుంబం వారు రక్తం అవసరమని బంజరు గ్రామానికి చెందిన కే.చిన్నప రెడ్డి కి  సమాచారం అందించడంతో తన పనులను వాయిదా వేసుకుని వెంటనే  భద్రాచలం ఏరియా హాస్పిటల్  వెళ్లి రక్తం అందించి మానవత్వం చాటుకున్నారు. దీంతో 13వ సారి రక్తదానం చేసి ప్రాణదాత గా మిగిలిపోయాడు. చిన్నపరెడ్డి స్పందించిన తీరుకు మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.ఇటీవల కాలంలో మొరంపల్లి బంజరు గ్రామంలో ఏర్పాటు చేసిన చేయూత ట్రస్టులో చిన్నపరెడ్డి లాంటి వారు ట్రస్ట్ సభ్యుడు ఉండటం ట్రస్ట్ అదృష్టమని ట్రస్ట్ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. మానవసేవే మాధవ సేవగా భావిస్తూ యువకులు రక్తదానం చేయడం పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.