ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే
== ప్రకటించిన సీఎం కేసీఆర్
== పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు
== బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ పార్లమెంట్ లోకి అడుగు పెట్టడం ఖాయం
== సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ స్పష్టీరణ
ఖమ్మం, నవంబర్ 01(విజయం న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ షూరూ అయ్యింది.. ఆరు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే అభ్యర్థుల ప్రకటనలో అందరికంటే ముందుండే సీఎం కేసీఆర్ మరోసారి తన మార్క్ ను నిలబెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్న సీఎం కేసీఆర్ ఆరు నెలల నుంచే కసరత్తు షూరు చేశారు. ఈ మేరకు తన మొదటి అభ్యర్థిని అధికారికంగా జనసందోహం నడుమ ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా అతనే పోటీ చేస్తారని, ఆయన గెలుపును ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. ఇంతకు ఆయన ఎవరు..? సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ నేత ఎవరు..?
ఇది కూడా చదవండి:- ప్రభాకర్ రెడ్డి పై దాడి హేయం : ఎంపీ నామ
== ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు కు మరో సారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. అరహారాదులు ఎదురు పడ్డా…ఎవరెన్ని అన్నా..ఏమీ మాట్లాడినా పైల్వాన్ లాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నామ నాగేశ్వరరావు బ్రహ్మాoడమైన మెజార్టీతో గెలవడం ఖాయమని సీఎం కేసీఆర్ సత్తుపల్లి సభలో లక్షలాది మంది ప్రజలు సాక్షిగా వెల్లడించారు. బుధవారం సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్, వేదికపై ఉన్న నామ నాగేశ్వరరావు ను చూస్తూ ఈ ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
ఇది కూడా చదవండి:- ఖమ్మం పై సీఎం కేసీఆర్ గురి
నామ మళ్లీ గెలిచి పార్లమెంట్ లో అడుగుపెడతారని, ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని ప్రజల హర్షాద్వానాల మధ్య సీఎం స్పష్టం చేశారు. అలాగే నాలుగోసారి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెడతారని అన్నారు. ఒకాయన జిల్లా నుంచి ఎవర్నీ అసెంబ్లీ గేటు తాకనియ్యనని అంటడు..ఇదేమైనా ఆయన జాజీరా అంటూ తీవ్ర స్థాయిలో పొంగులేటిపై మండిపడ్డారు.