ఆరోగ్య తెలంగాణే లక్ష్యం :మంత్రి పువ్వాడ
== వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వం
▪️ ఇక సామాన్యులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు..
▪️రూ. కోటి తో రెండు టిఫా నిర్ధారణ పరికరాలు..
▪️లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం-విజయంన్యూస్)
అరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు తగ్గట్టుగా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.కోటి వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ పరికరాన్ని మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: మానవ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉంది..మంత్రి పువ్వాడ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారని, ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసిందన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ రూపొందించిన టిఫా స్కానింగ్ పరికరం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది, ముఖ్యంగా తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేసిందన్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా రు.20 కోట్లతో మొత్తం 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు లాంఛనంగా ప్రారంభించామన్నారు. నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకావాలని కోరారు. ప్రైవేటులో 2 నుండి 3 వేలు అయ్యే స్కానింగ్ ఇక మీదట ఉచితంగా సర్కారు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రతి సామాన్యులకు చేరువైందని అన్నారు. అవసరమైన వారికి టిఫా స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుందన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాల ప్రకారం ఈ సౌకర్యం ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్![]()
టిఫా స్కానింగ్ ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారని, శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడొచ్చునని, లేదా అవకాశముంటే వైద్యుల సలహా మేరకు తదుపరి వైద్య సలహాలు పాటించి ఈ సమస్య నుండి అధిగమించే వీలుంటుందన్నారు. ప్రతి వంద మంది గర్భిణుల్లో 7శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని, వైద్య నిపుణులు చెబుతున్నారని, వీళ్లందరికీ టిఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారనివివరించారు. తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, అరోగ్య తెలంగాణ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, మేయర్ పూనకొల్లు నీరజ, డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ మాలతి, సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాస్, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యారు.
ఇది కూడా చూడండి: ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావును హత్య చేసినోళ్లను వదిలేదిలేదు: పువ్వాడ