Telugu News

సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత– కోటినలబై రెండులక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.

-- కోటి నాలబై రెండు లక్షల విలువ చేసే 566 కేజీల గంజాయి స్వాధీనం.

0

సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత– కోటినలబై రెండులక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.
— కోటి నాలబై రెండు లక్షల విలువ చేసే 566 కేజీల గంజాయి స్వాధీనం.

— ఆంద్రప్రదేశ్, మారేడుమిల్లి  నుంచి లారీలో మహారాష్ట్ర కు పోడి గంజాయి రవాణా.

— ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు…పరారీ మరో నిందుతుడు..
 
— గంజాయి తరలింపు మూలాలను పసిగట్టే పనిలో ప్రత్యేక బృందాలు.

— మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్.

(సత్తుపల్లి -విజయంన్యూస్)

విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీపీ వేంకటేశ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి సిఐ రామకాంత్ తన సిబ్బందితో  పట్టణంలోని జేవీఆర్ పార్క్ సమీపంలో బుధవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో ఎంహెచ్ 23 ఏయు 7377 నెంబరు గల ట్రాలీ లారీలో నిషేధిత పోడి గంజాయి తరలిస్తున్న గుర్తించి వాహనాన్ని, ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ వివరాలు వెల్లడించారు.

పరారీలో వున్న A3 నిందుతుడు గణేష్ ఉబాలే సూచనలతో సుమారు కోటి నాలబై రెండు లక్షల విలువ గల 566 కేజీల నిషేధిత గంజాయిని ఆంద్రప్రదేశ్, విశాఖపట్నంలో ఆటవీ ప్రాంతాలలో ట్రాలీ లారీలోని క్రింది భాగంలో రహస్యంగా అమర్చి  మారేడుమిల్లి,
రాజమండ్రి , సత్తుపల్లి మీదుగా
పోలీసులకు దొరకకుండా కట్టుదిట్టంగా మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ నిందుతులు పోలీస్  విచారణలో వెల్లడించారని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దుల మీదుగా గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు, అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి తరలింపు మూలాలను పసిగట్టే పనిలో వున్నాయని తెలిపారు. పరారీలో ఉన్న ఏ 3 నిందుతుడి కోసం  గాలిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్  సత్తుపల్లి పోలీసులను అభినందించారు.

నిందితుల వివరాలు:

A1) యోగేష్ లింబాజీ థోర్వ్
 S/o లింబాజీ, 30 సంవత్సరాలు, వంజరి, లారీ డ్రైవర్ R/o నాగేశ్వరి (Vi),
 పార్నర్ పోస్ట్, పటోడా తాలూకా, బీడ్ జిల్లా.  మహారాష్ట్ర రాష్ట్రం.

 A-2) ఇర్ఫాన్ సదర్ పఠాన్
 S/o సదర్, 39 సంవత్సరాలు, ముస్లిం, డ్రైవర్
 R/o అంబిజల్‌గావ్ గ్రామం, కర్జత్ తాలూక్, అహ్మద్‌నగర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం.

 A-3) గణేష్ ఉబలే, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర.

also read :- స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు,