ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టివేత
== పలు చోట్ల తనిఖీల్లో రూ.7.61లక్షలు పట్టుకున్న పోలీసులు
== ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, మండల శివారు, జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?
ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తనిఖీ చేస్తుండగా, కార్లు, లారీలు, డీసీఎంలు, చివరికి అంబులెన్స్ లను సైతం తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ వినిత్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమలైన గంటలోపై పెద్ద ఎత్తున్న నగదను పట్టుకున్న పోలీసులు రెండవ రోజు కూడా భారీగా నగదను పట్టుకున్నారు.
== రూ.7.61లక్షలు పట్టుకున్న పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీ ల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ. 1,21,100లను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి:-ఖమ్మం జిల్లాలో రూ.12.40లక్షల భారీగా నగదు పట్టివేత
మరోకార్ లో ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్నా రూ.3,40,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 4,61,100 నగదు ని ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి అశ్వారావుపేట పోలీసులు పట్టుకుని స్వాదీనం చేసుకున్నారు. అలాగే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వన్ టౌన్ లో వాహన తనిఖీల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఏపీ 39 ఎన్ఎల్ 7688 కారులో తరలిస్తున్న ఒక లక్ష ఇరవై వేల నగదును కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు సీజ్ చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 80 వేల నగదను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో కి రావడంతో తనిఖీల్లో భాగంగా నగదను పట్టుకున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి:- పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?
ఆంద్ర నుండి ఖమ్మం వైపు వెళ్తున్న కారును చెక్ పోస్ట్ వద్ద తనీఖీ చేసిన పోలీసులు రూ.80 వేల రూపాయాలు స్వాధినం చేసుకున్నారు. అలాగే మధిర నియోజవకర్గం పరిధిలోని ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ సెంటర్ లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తుండగా, కంచికచర్లకు చెందిన జనార్ధన్ రావు కు వద్ద ఉన్న రూ.1,00,000 నగదును ఎర్రుపాలెం ఎస్సై ఎం సురేష్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆదారాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.