Telugu News

ఖమ్మం లో జోరు వాన

ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం 

0

ఖమ్మం లో జోరు వాన

== ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం 

== తీవ్ర ఇబ్బందులు పడిన జనం

(ఖమ్మం -విజయం న్యూస్)

సాయంత్రం వరకు  తీవ్ర ఎండతో.. ఉక్కపోతుతో ఇబ్బందులు పడిన జనంకు కొంత ఊరట లభించింది .. ఖమ్మంలో మంగళవారం రాత్రి జోరు వర్షం పడింది.. ఎవరు ఊహించని విధంగా వర్షాకాలం తరహాలో ఉరుములు, మెరుపులతో ఖమ్మం నగరాన్ని వర్షం చుట్టుముట్టింది. సుమారు అరగంటపాటు నిలబడి కొట్టింది. దీంతో పురవీధుల్లో వరద పారింది. నిన్నటి వరకు ఉక్కపోత, తీవ్ర ఎండలతో అల్లాడిన ప్రజలు, రాత్రి కురిసిన వర్షంతో ఊరట కల్గించింది. కానీ ప్రజలందరు ఇండ్లకు వెళ్ళే సమయంలో వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక జోరు వానతో పురవీధుల్లో మురుగు, డ్రైనేజీ నీరు పరవళ్ళు తొక్కింది.. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో పాటు చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది..

ఇది కూడా చదవండి:- మూడో నెంబర్ “గుర్తుం”దా…!: విక్టరీ వెంకటేష్