Telugu News

నేడు భారీ వర్షాలు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశంఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

0

నేడు భారీ వర్షాలు.

(  ప్రతినిధి – విజయంన్యూస్) :-

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ ఏపీ- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని తెలిపింది. శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉన్నదని చెప్పింది.

దీని ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 27 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్‌ పెరిగినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు.

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. శుక్రవారం ఉదయం చెన్నై దక్షిణ కోస్తా జిల్లాల మధ్య తీరం తాకే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

also read :- ప్రధాన మోడీ సంచలన నిర్ణయం.. ఎందుకోసమంటే.