Telugu News

పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

డిసెంబర్ 3 నుంచి తెలంగాణలో దొర పాలనకు స్వస్తీ

0

పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

== డిసెంబర్ 3 నుంచి తెలంగాణలో దొర పాలనకు స్వస్తీ

== ఇందిరమ్మ రాజ్యం తథ్యం

== జోస్యం చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్

== ఆరు గ్యారంటీ స్కీమ్ లే కాంగ్రెస్ కు శ్రీరామరక్ష

== మాటపై నిలబడే పార్టీ కాంగ్రెస్

== ప్రజలందరు కాంగ్రెస్ వైపే ఉన్నారు

== అభ్యర్థులను ప్రకటించలేదు.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి

== విలేకర్ల సమావేశంలో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసక్తికర వ్యాఖ్యలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పిట్టలదొర మాటలు వినిపిస్తున్నాయని, పదేళ్ల కాలంలో ప్రజలకు ఏం చేయలేని సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు షెడ్యూల్ వస్తుందని తెలిసి కూడా అది చేస్తాం..ఇది చేస్తాం.. అంటూ ప్రజలను అకాశానికేత్తే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం కేసీఆర్ చెప్పే మాయమాటలు, మోసపూరిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు.. ఆయన్ను పిట్టలదొరగానే చూస్తున్నారు.. పదేళ్ల పాటు కష్టకాలంలో ఉన్న ప్రజలందరికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది.. ప్రజలకు మేలు చేసే ఇందిరమ్మ రాజ్యం రావాలని, కావాలని కోరుకుంటున్నారు. అందుకే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

తెలంగాణ తెచ్చుకుంది దొరల కోసం, దోపిడి దారుల కోసం కాదని మండిపడ్డారు.  నాలుగున్నర కోట్ల ప్రజల బాగు పడడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ కుటుంబ పాలనగా మార్చేశారని, రాష్ట్ర సంపదను ఆ నలుగురు దోచుకుంటూ దాచుకుంటున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. సర్వీస్ సెక్షన్లో పనికొచ్చే వ్యవస్థలను తీసుకురావడంలో విఫలమైందన్నారు. పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుపది సంవత్సరాల బడ్జెట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆరోపించారు. మాటలు మాత్రం కోటలు దాటించే టిఆర్ఎస్ నాయకులు ఎన్నికలవేళ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలారా వీరి పట్ల జాగ్రత్త ఉండాలని పిలుపునిచ్చారు.  ఓటు మన భవిష్యత్తుకు ఉపయోగపడేదని, అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడే మన ఓట్లను మోసగాళ్లకుదోపిడిదారులకు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు వేయాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ డ్రగ్గా మారి బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిందని ఆరోపించారు.  రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపితో చేతులు కలిపి తెలంగాణలో బిజెపికి బీ టీం గా పనిచేస్తున్నదన్నారు. బిజెపికి బీ టీముగా మారిన బీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీ వంత పాడుతూ భజన చేస్తున్నదన్నారు.

ఇది కూడా చదవండి: పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?

దేశ సంపదను ఆదాని భవన జాతి కంపెనీలకు దోచిపెట్టి ప్రధాని మోడీకి ఉపయోగపడే విధంగా మారిన బిఆర్ఎస్ ను ప్రజలు ఎవరు నమ్మడం లేదన్నారు.  బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే, బీజేపీ మరోసారి గెలిస్తే దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, నిత్యావసర ధరలు భారీగా పెరుగుతాయని, దేశసంపదను కార్పోరేటర్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ఎంపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు మద్దతుగా బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతున్న బిజెపికి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కు ఓట్లు వేద్దామా..? అని కోరారు. తెలంగాణకు సిరుల బంగారం కురిపిస్తున్న సింగరేణి కాలరీస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ సంపదలను దోచుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పానంగా అమ్మేస్తున్నదని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను తన బినామీల పేరిట నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు.  రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లాంటి రాష్ట్ర ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం పనికిమాలిన సంస్థలకు లీజికి ఇచ్చి రాబోయే 30 సంవత్సరాల ఆదాయాన్ని దోపిడీ చేస్తున్నదని విమ్మర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత గిరిజనులకు చెందకుండా పక్కదోవ పట్టిస్తున్న బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

ఇది కూడా చదవండి: కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో సగం బడ్జెట్ కేటాయించాల్సిన సీఎం కేసీఆర్ బీసీ బందు పేరిట తూతూ మంత్రంగా నిధులు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఇష్టంలేని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ మూడు లక్షలు రూపాయలు గృహలక్ష్మి పేరిట ఇచ్చారని,  అవి ఎన్నికల ముందు ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న దోపిడిదారులను తరిమికొడతామని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దోపిడి దారులను తరిమికొట్టే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్లా దుర్గప్రసాద్, మండల అధ్యక్షుడు, జిల్లా నాయకులు, మండల నాయకులు హాజరైయ్యారు.