హీడ్మా చనిపోలేదు: మావోయిస్టు కార్యదర్శి అజాద్
== తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతాం
== గగనతల దాడులు హేయం
== సరిహద్దు ల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ మోహరిస్తున్నారు
== ఆదివాసీలపై దాడులకు దిగుతుండటం హేయమైన చర్య
== దేశ సంపద దోచుకుపోయేందుకు దారులు సుగమం చేస్తున్న పాలకులు
== లేఖలో తీవ్రంగా ద్వజమెత్తిన భధ్రాద్రికొత్తగూడెం మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి అజాద్
(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్)
చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో బుధవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మావోయిస్టు నేత బెటాలియన్ కమాం డర్ కామ్రేడ్ హీడ్మా మరణించినట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు దేశం అంతా ప్రచారం చేసుకోవడం దారుణమని, ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి అజాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. దాడులు చేసింది నిజమే కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నారు.
ఇది కూడా చదవండి: అందరి చూపు ఆయన వైపే
దాడికి మాప్రజా గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) గట్టి సమాధానం ఇచ్చిందని, నిజంగా దేశ ప్రజలపై ఈ దేశంలో ఉన్న సైన్యం దాడి చేయడం తిరిగి ఆ దాడులను సమర్థిం చుకోవడం, దాన్ని గోప్పగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. దేశ భద్రత కోసం దేశాల సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం ఛత్తీస్ఘఢ్ అడవుల్లో ప్రతి నాలుగు ఊళ్ళ కు ఒక క్యాంపు పెట్టి ఆదివాసీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నిత్యం ఇనుప బూట్ల పదఘట్టనలో ఆదివాసీలు నలిగిపోతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో అత్యంత విలువైన సంపద ప్రస్తుతం ఛత్తీస్ఘఢ్ దండకారణ్యంలో ఉందని, అనేక రకాల ఖనిజాలు, అటవీ సంపద కొల్లగొట్టేందుకు బహులజాతీ కంపెనీలు పన్నాగం పన్నాయని అన్నారు. . మిగతా ప్రాంతాల్లో లాగా ఇక్కడ సంపద దోచుకుపోయేందుకు వీలుపడటం లేదని, ఆదివాసీలను నిత్యం చైతన్యం చేస్తూ వారి సంపద వారికే దక్కాలని మావోయిస్టు పార్టీ కోరుతుందన్నారు. ఇది పాలకులకు మింగుడు పడటంలేదని, అందుకు మావోయిస్టు పార్టీని ధ్వంసం చేసేందుకు శతవిధాల కుట్రలకు పూనుకుంటుందని ఆరోపించారు. మొత్తం ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంపుగా మార్చింద,ఆకుపచ్చ అడవిలో నెత్తుటేరులు పారించేందుకు నిత్యందాడులు చేస్తుందన్నారు. ఆఖరికి వైమానిక దాడులు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని, ఇప్ప టికే అనేక మార్లు వైమానిక దాడులకు పూనుకుంది, అనేక సార్లు గ్రామాలపై మోటార్ సెల్స్ వేసిందని, వీటన్నిటిని ప్రజలు గమనించాలని, మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు సామధాన బేధదండోపాయాలను వెంచుకుందన్నారు. ఇలాంటి దాడులను ఖండించాలని పిలుపునిస్తున్నాం.
ఇది కూడా చదవండి: ‘ఖమ్మం’ పై నేతల పోకస్
కేంధ్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షా లు ఇద్దరూ సామ్రాజ్య వాద ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. దేశంలో రాజ్యంగ హక్కు లను హరించివేస్తున్నారు. ప్రశ్నిం చే హక్కు, జీవించే హక్కు లను కాలరాస్తున్నారు. దేశ సంపద కొందరి చేతుల్లో ఉండేందుకు వీలు కలిగేలా చట్టాలను చేస్తున్నారు. సమాధాన్ ప్రహార్ దాడులను ఖండించండి. దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయండం హేయమైన చర్య. ప్రజలారా మేల్కొ నండి, దేశ సపద కాపాడుకునేందుకు పోరాటాలు చేయండి. గ్రీన్ హంట్ కు వ్యతిరేకం గా పోరాడండి. దండకారణ్యం లో ఏర్పాటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసం హరించాలి. ప్రజా గెరిల్లా సైన్యం వర్థిల్లాలి.