Telugu News

హలో ఖమ్మం.. జయం మనదే: వెంకటేష్

సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పిలుపు

0

హలో ఖమ్మం.. జయం మనదే: వెంకీ

== భద్రాచలంలో రాముడు.. ఖమ్మం లో రఘురాముడు

== మన రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
==  సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పిలుపు

== ఖమ్మం లో రోడ్ షోకు అనూహ్య స్పందన 

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):

హలో ఖమ్మం..జయం మనదే..? ఖమ్మం..గుమ్మం.. కాంగ్రెస్ దే.. ఖమ్మం నుంచి మన రఘురాం రెడ్డి పోటీ చేశాడు అందరికి తెలుసుగా.. ఆయనకు భారీ విజయ అందించాలి మరీ.. అంటూ సినీ హీరో, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు అయిన దగ్గుబాటి వెంకటేష్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం అభ్యర్థి రఘురాం రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ.. నగరంలో రోడ్ షో నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- మూడో నెంబర్ “గుర్తుం”దా…!: విక్టరీ వెంకటేష్

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి మయూరి సెంటర్ నుంచి.. ఐటీ హబ్ వరకు రోడ్ షో గా ముందుకు సాగుతూ.. జెడ్పీ సెంటర్, ఇలెందు క్రాస్ రోడ్లలో ప్రసంగించారు. అశేషంగా తరలివచ్చిన అభిమాన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

*”* ఖమ్మం.. ఖమ్మం.. ఖమ్మం.
అంతా ఎలా ఉన్నారు.
నేను ఇక్కడికి ఎందుకోచ్చాను అంటే..?
పేరు మీ అందరికీ తెలుసు కదా..
అదే.. మన రఘురాo రెడ్డి.
గుర్తు గుర్తుంది కదా.. హస్తం.
ఏం చేయాలో.. తెలుసుగా..
ఈ నెల 13వ తేదీన..
ఈవీఎం లో 3వ నంబర్ బటన్ నొక్కి.. హస్తం గుర్తు పై ఓటేద్ధాం.
ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాo
రెడ్డి. మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిద్దాం”
అని విక్టరీ వెంకటేష్ ఖమ్మం ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావెద్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, తుమ్మల యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో వెంకీ మామ సందడి