సహాయం చేయండి..సింధును రక్షించండి
== సింధును రక్షించుకునేందుకు చేయూత
== స్వచ్ఛందంగా స్పందిస్తున్న ప్రజలు
== సింధు వైద్యానికి రూ.10లక్షలు ఖర్చు అయ్యే అవకాశం
== 6లక్షల వరకు అర్థిక సహాయం చేసిన ప్రజలు
== ఇంకా సహాయం చేయాలని కోరుతున్న ధర్మతండా యువత
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఇది కదా నిజమైన మానవత్వం అంటే.. ఓ నిరుపేద బిడ్డ అపదలో ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు వందల మంది స్పందించడం మనుషుల మానవత్వానికి.. మంచితనానికి నిదర్శనం.. బిడ్డను కాపాడకునేందుకు మేము సైతం అంటూ యావత్తు తెలుగు ప్రజలు స్పందించి చేయూతనందిస్తున్నారు. ‘చేయూతనందించండి.. సంధ్యను కాపాడండి’ అంటూ ఓ మేసేజీని సోషల్ మీడియా కేంద్రంగా పోస్ట్ చేయడంతో ఆమెను కాపాడుకునేందుకు జనం కదిలారు.. ఎవరికివారు చేతనైన సహాయం చేస్తూ ఆ బిడ్డ బ్రతికిరావాలని కోరుకుంటున్నారు ప్రజలు..
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ విగ్రహంపై పాలి‘ట్రిక్స్’
ఎవరు అడగకుండానే యువత పెట్టిన పోస్ట్ కు స్పందించిన జనం ఎవరు ఊహించని విధంగా స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి కోసం యువకులు పడుతున్న ఆరాటానికి ప్రజలు స్వచ్ఛందంగా చేయూతనందిస్తున్నారు.. చేయ్యిచెయ్యి కలిపి సింధు మెరుగైన వైద్యానికి దారి చూపుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాకు చెందిన జర్పుల పరుశురామ్ కుమారుడు సందీఫ్, కుమార్తే సింధు, ఆయన బావ కుమార్తే హరిత ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వస్తుండగా కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సందీఫ్ అక్కడిక్కడే చనిపోయాడు. సింధు, హరిత ఇద్దరికి గాయాలు కాగా వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సింధు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ లో బ్లెడ్ ప్లాట్ అవుతుండటంతో పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఎంతఖర్చైన పర్వాలేదు రక్షించండి అంటూ ధర్మతండాకు చెందిన యువత, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో మెరుగైన వైద్యాన్ని అందించగా, ఆమె కొంత మేరకు కోలుకుంది. అయితే పూర్తి స్థాయిలో కోలుకునేందుకు సుమారు రూ.10లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చేప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతమైయ్యారు. ఒక వైపు కొడుకు మరణించడం, మరో వైపు కూతురు ధీనాస్థితిలో పడిపోవడం, వైద్యానికి డబ్బులు లేకపోవడంతో ధర్మతండాకు చెందిన యువత కదిలారు.
ఇది కూడా చదవండి: సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి
మేమున్నామంటూ ముందుకు వచ్చారు. కూసుమంచి మండల కేంద్రంలో, స్నేహితులు, బందువులకు పోన్ల ద్వారా మాట్లాడి అర్థిక చేయూతనందించాలని కోరుతున్నారు. నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అర్థిక చేయూతనందించాలని కోరుతున్నారు. అంతే కాకుండా అర్థిక సహాయం కోసం సోషల్ మీడియా వేదికను వాడుకున్నారు. సంఘటనలో జరిగిన సన్నివేశాన్ని, అలాగే వారి పరిస్థితిని గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో వందలాధి మంది జనం స్పందించారు. వారికి చేతనైన సహాయం చేశారు. 100 నుంచి లక్ష వరకు సహాయం చేస్తున్నారు. గ్రూపులో పెట్టిన గుగుల్, పోన్ ఫే నెంబర్ కు డబ్బులను పంపిస్తున్నారు. సుమారు ఇప్పటి వరకు రూ.6లక్షల వరకు వసూళ్లు అయినట్లు యువకులు తెలిపారు. ఇంకా సుమారు రూ.4లక్షలు కావాల్సి ఉంది. తద్వారా ఇంకా మెరుగైన వైద్యం దొరికే అవకాశం ఉంది. అందుకే..
== చేయూతనందించండి.. సంధ్యను కాపాడండి..
మీటింగ్ ల కోసం.. జనంతరలించేందుకు.. పార్టీలకు.. పంక్షన్లకు.. వివాహాలకు.. దోస్తుల కోసం మందు, విందు పార్టీలు చేస్తాం.. రాజకీయాల కోసం లక్షలను ఖర్చు చేస్తాం.. చదువులకు, ఆసుపత్రులకు లక్షలు ఖర్చు చేస్తాం.. ఏది కూడా తిరిగి వచ్చే ఖర్చు కాదు.. కానీ ఓ ఆడబిడ్డ.. మన ఆడబిడ్డ చావుబతుకుల నడుమ చికిత్స పొందుతుంది. ఆమెను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది.. ముఖ్యంగా తెలుగు ప్రజలపై ఉంది.. మంచి ర్యాంకులతో చదువుకుంటున్న యువతి నేడు అస్తిత్వంగా బెడ్ పై ఉంది..
ఇది కూడా చదవండి: కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి
ఆమెకు పునర్జీవం పోయాలంటే మనమంతా స్పందించాలి.. చేతనైన సహాయం అందించాలి.. ఇది భారం కాదు.. బాధ్యత.. సాటి మనిషిని కాపాడుకునే బాధ్యత.. మన హక్కు కూడా.. ఎందుకు ఇలా రాస్తున్నామంటే.. ఎన్నో చోట్ల.. ఎంతో ఖర్చు చేశాం.. ఒక రోజు సినిమాకు వెళ్లలేదనుకుంటే 500 ఖర్చుమిగులుతాయి.. ఒక్క రోజు తాగలేదు అనుకుంటే రూ.500 మిగులుతాయి.. మీరు రోజువారిగా చేసే ఖర్చు ఒక్కటి ఆపి ఆ పాప వైద్యానికి పంపించినా ఆమె తిరిగి మనమద్య నడుస్తూ సంతోషంగా జీవిస్తుంది. ఒక్క సారి ఆలోచించండి.. సహాయం చేయండి.. చేయూతనందించండి.. సింధు వైద్యానికి సహాకరించండి.. మా వంతుగా సహాయం చేశాం.. ఇక మిగిలింది మీ వంతే..? ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరు స్పందించండి.. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు, బల నిరూపణ కోసం భారీగా ఖర్చులు చేసే నాయకులు స్పందించండి.. జనం తరలించేందుకు బలనిరూపణ కాదు.. నిరుపేద యువతిని కాపాడుకునే విషయంలో ముందండండి.. ఈ విలేకరి, ఈ పత్రిక ఎందుకు ఇలా రాస్తుందని ప్రశ్నించిన, మమ్మల్ని తిట్టుకున్న పర్వాలేదు.. ఆడబిడ్డ బ్రతికితే చాలు.. అదే మాకు కొండంత ఆనందం.. సహాయం చేసేవారందరికి విజయం పత్రిక తరుపున చేతులేత్తి దండం పెడుతున్నాం. చేసేవారు ఆలోచించకుండా చేయండి.. ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.. ప్రతి నెల సంపాధించే దానిలో కేవలం 5శాతం మాత్రమే ఆ పాప వైద్యానికి అందించండి.. దాతలు సహాయం చేయదలచిన వారు ఫోన్ పే / గూగుల్ పే నెంబరు:-8464959258 (జర్పుల రాజ సింధు అన్నయ్య) ధన్యవాదాలు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?