Telugu News

ఇక్కడ నేనే ‘బాస్

తిరుమలాయపాలెంలో టీఆర్ఎస్ నేత అత్తుత్సహాం

0

==ఇక్కడ నేనే ‘బాస్’
== తిరుమలాయపాలెంలో టీఆర్ఎస్ నేత అత్తుత్సహాం
== భూ వివాదంలో తలదూర్చిన మండల పార్టీ అధ్యక్షుడు
== బాధిత కుటుంబంపై సుమారు 20మందితో దాడికి యత్నం
== వీడియో తీస్తున్న మహిళపై మండల అధ్యక్షుడు దాడి..
== పట్టించుకుని పోలీసులు.. పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల రాస్తారోకో
== హాజరైన బీజేపీ జిల్లా నాయకులు
== పోలీసుల హామితో ఆందోళన విరమణ.. పలువురిపై కేసు నమోదు

==(విజయం న్యూస్):-
బాషా..ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు.. ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వినాలా..? నేను చెప్పిందే చేయాలా..? నాకు రారు ఎవరు సాటి.. నాకు నేనే పోటీ.. నాదారి రహదారి.. లేకుంటే ఆసుపత్రికి ‘పోయే’దారి.. అంటూ ఓ నేత హుకుం జారీ చేస్తున్నాడు.. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని ఆ నేత చేస్తున్న హుకుం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రజలు వాపోతున్నారు.. మంగళవారం జల్లేపల్లిలో జరిగిన సంఘటన కూడ అందుకు అద్దం పట్టిందనే చెప్పాలి..

also read :-శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం..

అన్నదమ్ముళ్ల ఇంటి స్థల పంచాయతీలో ఎలాంటి సంబందం లేని మండల పార్టీ అధ్యక్షుడు బాధితులపై దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది.. ఆయన చేసిన అత్యుత్సహం సంచలనం రేపింది.. గోటితో పోయే గొడవను గొడ్డలి దాకా తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది.. బాధితులపై దాడులు.. కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం.. బాధితుల రోడ్డు నిర్బంధం.. ముగ్గురుపై కేసు నమోదు.. అంతా చినికిచినికి గాలివానగా మారింది.. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన నాగండ్ల జగ్గయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఆయనకు చెందిన 7కుంటల ఇండ్ల స్థలం ఉంది. అయితే పెద్ద కుమారుడు నాగండ్ల ప్రసాద్, రెండవ కుమారుడు నాగండ్ల ఉపేందర్ ఉండగా మూడవ కుమారుడు చనిపోయారు. వాళ్లకు సంతానం లేకపోవడంతో తండ్రి ఆస్తిని ఇద్దరు కుమారులు పంపకాలు చేసుకోవాల్సి ఉంది. కానీ తండ్రి వారసత్వంగా వస్తున్న 7కుంటల ఇండ్ల స్థలాన్ని నాగండ్ల ఉపేందర్ అక్రమించుకోగా, నాగండ్ల ప్రసాద్ అందులో రెండు కుంటల భూమిలో ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఉపేందర్ స్థానిక నాయకుల అండదండలతో ప్రసాద్ కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. 2008 నుంచి ఇదే పరిస్థితి ఉండగా, గత కొద్ది రోజులుగా భూమిపైకి నాగండ్ల ప్రసాద్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఉపేందర్, తన అనుచరగణంతో ప్రసాద్ కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే నాగండ్ల ప్రసాద్, తన కుటుంబ సభ్యులు కలిసి రెండు కుంటల భూమిలో ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుండగా ఉపేందర్ అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు.

also read :-సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఉత్సంగా వనదేవతల గద్దెలపైకి ఆహ్వానం .

కాగా మంగళవారం ఉపేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ ఉపసర్పంచ్ బాషబోయిన వీరన్న, సుమారు 20 మంది అనుచరులతో కలిసి ఇంటి నిర్మాణం చేస్తుండగా డోజర్ తో కూల్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న నాగండ్ల ప్రసాద్, కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసేందుకు యత్నించారు. ఆ సంఘటనను ప్రసాద్ కుమార్తే సెల్ పోన్లో వీడియో తీస్తుండగా మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాషబోయిన వీరన్న ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. వీడియో తీస్తున్నావా..? నన్ను తీయి..నన్ను తీయ్ అంటూ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ చెప్పపై కొట్టడంతో ఆ యువతి కిందపడిపోయింది.
== స్పందించని పోలీసులు
గొడవ జరుగుతున్న సమయంలో ప్రసాద్ కుమార్తే సిందు 100కు కాల్ చేసింది. కొద్ది నిమిషాల వరకు పనిచేయకపోవడంతో తిరుమలాయపాలెం పోలీసులకు పోన్ చేసియగా, వాళ్లు స్పందించలేదని, తక్షణమే ఏసీపీ కి ఆపీస్ కు పోన్ చేయగా వారు స్పందించి ఎస్ఐ కి పోన్ చేసి చెప్పగానే తిరుమలాయపాలెం ఎస్ఐ సంఘటన స్థలానికి వచ్చారని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. అక్కడికి వచ్చిన పోలీసులు బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి వెళ్లిపోయారని, కానీ మా మండలానికి తెలియని వ్యక్తులు దాడి చేసేందుకు వస్తే వారిని కనీసం మందలించలేదని మీడియాకు సిందు అనే యువతి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పటికి పోలీసులు పట్టించుకోలేదని, రాజీ పడితే పోతది కదా అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని ఆమె మీడియాకు తెలిపారు. అనంతరం ఆమె వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హాట్ టాఫిక్ గా మారింది. పోస్టు నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది.
== గంట పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో
20మందితో దాడి చేసి, హత్యయత్నం చేసేందుకు ప్రయత్నించిన బాషబోయిన వీరన్న,వారి టీమ్ పై హత్యానేరం కిందా కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై బేటాయించారు. వీరికి బీజేపీ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. రోడ్డుపై బీజేపీ పార్టీ కిషాన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూసుమంచి సీఐ సతీస్ ఆందోళన కారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఖమ్మం రూరల్ ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని బాధితులకు హామినిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ విషయం పోలీసులను వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

also read :-****పిలిస్తే పలుకుతా..! తోచిన సాయం చేస్తా..: పొంగులేటి
== బాషబోయిన వీరన్నపై గతంలో ఫిర్యాదులు..?
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాషబోయిన వీరన్నపై గతంలో అనేక ధపాలుగా ఫిర్యాదులు ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు ఉన్నప్పటికి కూడా పోలీసులు పట్టించుకోకుండ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బయటపడ్డారని బాధితులు మీడియాకు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, ఎమ్మెల్సీ తాతామధుసూధన్ నాకు అండగా ఉన్నారు..

నన్నేమి చేయలేరు అంటూ ఎందర్నో బెదిరింపులకు పాల్పడుతున్నారని, మాపై కూడా బెదిరింపులు అలాగే చేస్తున్నారని తెలిపారు. దాడి జరిగిన తరువాత ఆయన ఆ ఇద్దరి పేర్లు చెప్పగానే నేను కందాళ ఉపేందర్ రెడ్డికి, తాతామధు కు పోన్ చేశానని, ఎమ్మెల్యే పోన్ ఎత్తి నేను మాట్లాడుతాను అని చెప్పారు కానీ స్పందన లేదన్నారు. తాతామధుకు పదిసార్లు పోన్ చేసిన ఎత్తలేదని బాధితురాలు సిందు తెలిపారు. గౌరవ ప్రద పోస్టుల్లో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మమ్మల్ని అదుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతూ దుండగులతో దాడులు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితురాలు కోరుతున్నారు.