ఇల్లెందు కాంగ్రెస్లో యువతేజం?
– పాదయాత్రకి హాజరైన పెండికట్ల యాకయ్య
– రేవంత్ ,సీతక్క అండదండల పుష్కలం
– టచ్ లో ఉండు అంటూ అభయ విచ్చిన నేతలు
– నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్న పెండికట్ల
(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయంన్యూస్)
వృద్ధాప్య కాంగ్రెస్ లో యువ కిరీటం దూసుకెళ్తున్నాడు.ఇల్లెందు నియోజవర్గ కేంద్రంగా ఆదివాసి యువ సంచలనం యాక్టివ్ గా కాంగ్రెస్ లో పాల్గొంటున్నాడు. నియోజవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ అనుబంధ కుటుంబాలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. ఈ నేపథ్యంపై విజయం ప్రతినిధి ప్రత్యేక కథనం.
ఇల్లెందు నియోజకవర్గం పోరాటాలకు పురిటిగడ్డ ఒకప్పుడు విప్లవ వామపక్ష పార్టీలు 60 సంవత్సరాలు శాసించాయి.ఇప్పుడు నూతన శకం మొదలైంది.నియోజవర్గ పునరవిజన్లో భాగంగా ఇల్లెందు భౌగోళిక స్వరూపం మారిపోయింది విప్లవ వామపక్ష పార్టీలకు చెక్కుబెట్టాల్సిన స్థితి ఏర్పడింది.తెలంగాణ రాష్ట్ర పునర్విభజన జరగడం తెలంగాణ ఏర్పడడంతో ఇల్లెందు స్థితిగతులు మారిపోయావు. విషయం ఏమిటంటే 2014 నుండి కాంగ్రెస్ బిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలు శాసించాయి.
allso read- నేడు ఇల్లందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర
2014లో కాంగ్రెస్ నుండి కోరం కనకయ్య విజయం సాధించారు.టిడిపి రెండో స్థానం, బి ఆర్ ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు.ఎట్లా లేదన్న 30000 వేల వరకు ఓట్ బ్యాంకు ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నే పద్యంపై తెరమీదకు పెండకండ్ల వ్యాకయ రావడం పట్ల ఆసక్తిగా మారింది.
– సీతక్కతో సన్నిహితం?
ఆదివాసి బిడ్డ సీతక్క ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యే. గత కొన్ని సంవత్సరాలుగా పెండేకట్ల యాకయ్య ఆమె అనుచరుడుగా ముద్ర సంపాదించుకున్నాడు.రాహుల్ చౌదరి రేవంత్ పాదయాత్ర లో పలుమార్లు సీతక్క యాకయ్యను రాహుల్ రేవంత్ రెడ్డి పరిచయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో యాకయ్య క్రేసిలక పాత్ర పోషిస్తున్నారు.నియోజవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కుటుంబాలకు అండదండలుగా నిలుస్తున్నారు.కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కుటుంబాలను ఎప్పటికప్పుడు కలుస్తూ సమావేశం అవుతున్నాడు.ఇల్లెందు నియోజకవర్గ వ్యాప్తంగా కలయ తిరుగుతూ పర్యటిస్తున్నాడు.
– టచ్ లో ఉండు రేవంత్? allso read- ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?
రేవంత్ రెడ్డి పాదయాత్ర మేడారంలో ప్రారంభం కాగానే ఇల్లెందు నుండి పెండికట్ల యాకయ్య హాజరయ్యారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పలుమార్లు రేవంత్ రెడ్డికి ఏకైన పరిచయం చేశారు.గతంలో రాహుల్ గాంధీకి ఏకైను పరిచయం చేసిన సందర్భాలు లేకపోలేదు.ఈ రేపద్యంలో యాకయ్యను రేవంత్ రెడ్డి టచ్ లో ఉండమని చెప్పినట్లు సమాచారం.పార్టీలో యాక్టివ్గా పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తుంది.
– యువతలో మంచి క్రేజ్?
పెండికట్ల యాకయ్యకు యువత లో మంచి క్రేజ్ ఉంది.ఎక్కడికి వెళ్ళినా యువత ప్రమాదం పడుతున్నారు.దూసుకుపోయే తత్వం ఆకర్షించే గుణం ఉండడంతో ఆయన పట్ల క్రేజీ పెరిగింది.ఇటీవల కాలంలో నియోజవర్గ్యాప్తంగా చాలా పర్యటన చేసిన సందర్భాలు ఉన్నాయి.యువత చూసిన మేరకు రాజకీయాల్లో రావడానికి మొగ్గు చూపుతున్నాడు.ఇది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో యాకయ్య సంచలనం సృష్టిస్తాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే జరిగితే కాంగ్రెస్ వనములో ఆదివాసి యువతేజం సంచలన సృష్టించే అవకాశం లేకపోలేదు.