Telugu News

గౌడ కులస్తుల సేవలను కొనియాడిన హీరో సుమన్…

వనబోజన మహోత్సవంలో హీరో సుమన్,జాతీయ అధ్యక్షులు రామారావుని సన్మానించిన వీరస్వామి గౌడ్...

0

గౌడ కులస్తుల సేవలను కొనియాడిన హీరో సుమన్…

వనబోజన మహోత్సవంలో హీరో సుమన్,జాతీయ అధ్యక్షులు రామారావుని సన్మానించిన వీరస్వామి గౌడ్…

సూర్యాపేట

జాతీయ స్థాయిలో ఉన్న గౌడ కులస్తుల అందరిని ఏక తాటిపైకి తీసుకొచ్చిన జాతీయ స్థాయి గౌడ సంఘ నాయకులంతా నిజమైన హీరోలని సినీ హీరో సుమన్ వ్యాఖ్యానించారు.
ఆదివారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జై గౌడ ఉద్యమం సంఘం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవంతో పాటు జరిగిన వనభోజన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించినట్లు జై గౌడ ఉద్యమం సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ

గౌడ కులస్తుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా వనబోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు.సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని హీరో సుమన్ సూచిoచినట్లు స్పష్టం చేశారు.అంతకు ముందు సంఘ జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు, సంఘ ఉపాధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ లు హీరో సుమన్ తో తనకి పరిచయం చేసిన అనంతరం ఆయనను శాలువాతో సన్మానించినట్లు చెప్పారు.తన సేవలను,ఉద్యమ స్ఫూర్తిని హీరో సుమన్ కి వివరించగా వీరస్వామి గౌడ్ చిన్న వయస్సులోనే మంచి సేవా కార్యక్రమాలను ఎంచుకున్నాడని, మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పినట్లు వివరించారు.గౌడ కులస్థులనే కాకుండా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాగే ప్రజల మనస్సును గెలవాలని ఆకాకాంక్షించినట్లు తెలిపారు.ఈ సంధర్భంగా సుమన్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.

also read :- మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

 

please subscribe this chanel smiling chaithu