Telugu News

ఏజెన్సీ లో హై ఆలర్ట్ 👉మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన

జిల్లా పోలీస్ అధికారుల పని తీరును మెచ్చుకున్న డిజిపి

0

ఏజెన్సీ లో హై ఆలర్ట్
👉మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన
👉జిల్లా పోలీస్ అధికారుల పని తీరును మెచ్చుకున్న డిజిపి

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. డిజిపికి మహేందర్ రెడ్డి కి జిల్లా ఎస్పి సునీల్ దత్ ఐపీఎస్ స్వాగతం పలికారు.జిల్లా మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన కొనసాగింది అని తెలుస్తుంది.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో చర్ల మండలం చెన్నాపురం లో పర్యటించిన డిజిపి మహేందర్ రెడ్డి. మావోయిస్ట్ వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను, మావోయిస్టు కార్యకలాపాలు కు చెక్ పెట్టేందుకు సూచనలు చేసిన డిజిపి. తెలంగాణ, చత్తీస్‌గఢ్ అంధ్రా సరిహద్దులలో నిఘా పెంచాలంటూ సూచనలు చేశారు.

మావోయిస్టుల పై ఉక్కుపాదం మోపెందుకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుండి ఈనెల 8 వరకు వారోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే ఏజెన్సీ లోకి ఆర్ టిసి బస్సులు కూడా నిలిపివేశారు. ప్రజాప్రతినిధులు అనుమతులు లేకుండా పర్యటించోద్దంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలపై

ఈ సందర్భంగా డీజీపీ చర్చించారు. గురువారం నుంచి మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన రహస్యంగా సాగింది. సరిహద్దుల్లో భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ డీజీపీకి వివరించారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పెద్ద మిడిసిలేరు నుంచి చెన్నాపురం వరకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. కీకారణ్యమైన చెన్నాపురానికి డీజీపీ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఉన్నారు.సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ ఎస్పిలతో సమావేశం ఏర్పాటు చేశారు.

అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నకు చేరుకున్న డిజిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ సారధ్యంలో పోలీసు అధికారులు ప్రజల సహకారంతో అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.అతి తక్కువ కాలంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కూడా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ పనితీరు అభినందనీయం అని అన్నారు. జిల్లా పోలీసు అధికారులు స్పెషల్ పార్టీ కమాండోలు బాధ్యతగా తమ విధులును నిర్వరిస్తూ నిషేధిత మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వి.తిరుపతి,ఏఆర్ అడిషనల్ ఎస్పి శ్రీనివాసరావు,ఏఎస్పీలు శబరీష్ ఐపీఎస్,వినీత్ ఐపీఎస్,రోహిత్ రాజు ఐపీఎస్,అక్షాన్ష్ ఐపీఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

also read :- ప్రేమకోసం రాలిన కుసుమం…ప్రేమ గెలిచింది.. ఆమె ఓడింది