Telugu News

**వనమా రాఘవాకు హైకోర్టులో చుక్కెదురు బెయిల్ మంజూరు చేయని హైకోర్టు

0

***వనమా రాఘవాకు హైకోర్టులో చుక్కెదురు
*** బెయిల్ మంజూరు చేయని హైకోర్టు
***(ఖమ్మం-విజయంన్యూస్):-
రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. నిందితుడు రాఘవ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్ట్ కోట్టేసింది. గతంలో కూడా కొత్తగూడెం కోర్ట్ కూడా వనమా రాఘవకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం పాఠకులకు తెలిసిందే.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వనమా రాఘవకు బెయిల్ మంజూరు చేయాలని ఆయనకు సంబంధించి లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో వనమా రాఘవకు మరో సారి షాక్ తప్పలేదు. కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని కోరాయి.

also read :-***ముదిగొండలో నకిలీ పొద్దు తిరుగుడు విత్తనాలు

టీఆర్ఎస్ పార్టీ వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ప్రస్తుతం హైకోర్ట్ బెయిల్ నిరాకరించడంతో రిమాండ్ లోని ఉండాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలన కలిగించింది. రామక్రిష్ణతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో చనిపోయారు. ఆస్తి వివాదంలో సెటిల్మెంట్ చేయడానికి వచ్చిన వనమా రాఘవ తన భార్యను పంపాల్సిందిగా కోరినట్లు బాధితుడు రామక్రిష్ణ ఆరోపించాడు. ఆసమయంలో బాధితుడు రామక్రిష్ణ సెల్ఫీ వీడియో వైరల్ అయింది. రాఘవ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా భద్రాద్రికొత్తగూడెం పోలీసులు వనమా రాఘవేంద్రను అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

also read :-*వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి

కాగా 14 రోజుల పాటు రిమాండ్ చేసిన కోర్టు, ఆ తరువాత రిమాండ్ ను పొడగించింది. దీంతో వనమా రాఘవేంద్ర కు సంబంధించిన అడ్వకేట్స్ కొత్తగూడెం కోర్టులో బెయిల్ కోసం పిటషన్ దాఖలు చేయగా, ఆ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో మరో 14 రోజుల పాటు రిమాండ్ చేసింది. కాగా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో కూడా చుక్కెదురు తప్పలేదు. దీంతో మరి కొద్ది రోజుల పాటు రిమాండ్ తప్పదేమోనని అనిపిస్తోంది.