Telugu News

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే రాములు నాయక్

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

0

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

== విద్యారంగానికి అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే రాములు

ఏన్కూరు. జూన్ 20( విజయం న్యూస్)

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఏన్కూరు లో ని గురుకుల బాలుర విద్యాలయంలో తెలంగాణ విద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ కు , కస్తూర్బా గాంధీ, గురుకుల పాఠశాల విద్యార్థులు, అధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, గురుకుల విద్యాలయాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యా అందిస్తుందన్నారు. విద్యార్థులకు, పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసి, దేశంలోనే విద్యారంగాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారన్నారు.పట్టుదల క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. చదువుతూనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందన్నారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. గురువులు సమాజానికి మార్గదర్శకులు అని అన్నారు. తొలుత సరస్వతీ దేవి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఇది కూడా చదవండి: సక్సెస్ పంతులు చారిని సన్మానించిన ఎమ్మెల్యే

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. గురుకుల పాఠశాలకు 10 లక్షలు, కస్తూరిబా పాఠశాలకు ఐదు లక్షలు ఎమ్మెల్యే మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, రైతు బంధం మండల కన్వీనర్ మేడ ధర్మారావు, సర్పంచ్ చిర్రారుక్మిణి, ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి, ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్యలాలు నాయక్, గార్ల ఒడ్డు దేవాలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ భూక్య చందులాల్ నాయక్,కట్టా కృష్ణార్జునరావు, బానోత్ సురేష్ నాయక్, పసుపులేటి మోహన్రావు, ఎంపీడీవో అశోక్, ఎంఈఓ జయరాజు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, పురం అంజన్ కుమార్ యాదవ్, హెచ్ఎం శైల, ఎస్సై బాధావత్ రవి తదితరులు పాల్గొన్నారు