Telugu News

పాదయాత్రను ప్రారంభించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక,

0

పాదయాత్రను ప్రారంభించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక,

(విజయం న్యూస్):-
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) నుఆదివారం ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభించారు. ముందుగా గ్రామం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది.

also read :-నేటి నుంచి భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్

గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకందిద్దారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో యడవెల్లి హోరెత్తింది. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కగారి పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ … ప్రజల సమస్యలను ఆలకిస్తూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు