Telugu News

చరిత్ర తిరగ రాయబోతున్నాం:నామా

అన్నపురెడ్డిపల్లి లో నామ రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మ రధం - నీరాజనం

0

చరిత్ర తిరగ రాయబోతున్నాం:నామా

❇️ మళ్లీ భ్రమలు కల్పిస్తున్న కాంగ్రెస్ ను నిలదీయాలి

❇️ ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

❇️ అబద్ధపు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

❇️ మండుతున్న ప్రజల గుండెలు

❇️ తెలంగాణా ప్రజల ప్రయోజనాలు కాపాడే సత్తా బీఆర్ ఎస్ ఎంపీ లకే ఉంది

❇️ రైతు బిడ్డను కాపాడుకోండి

❇️ అన్నపురెడ్డిపల్లి లో నామ రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మ రధం – నీరాజనం

❇️ అంబేద్కర్ కు నివాళి

👉 అన్నపురెడ్డిపల్లి భారీ రోడ్డు షోలో బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే లు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు

(అన్నపురెడ్డిపల్లి-విజయం న్యూస్):

మోసపూరిత హామీలకు గెలిచిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చురక అంటించి, చరిత్రను తిరగరాయబోతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామ నాగేశ్వరావు
ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
సోమవారం రాత్రి అన్నపురెడ్డిపల్లి లో ఎన్నికల ప్రచారం
సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు .మహిళలు హారతులతో ఎదురేగి పూలు చల్లుతూ ,కోలాట నృత్యాలతో నామాకు ఘన స్వాగతం పలికారు .ఈ సందర్భంగా నామ స్థానిక సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసగించి, అధికారంలోకి వచ్చిందని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలకు భ్రమలు కల్పిస్తూ మోసగించే ప్రయత్నం చేస్తుందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నామ తెలిపారు
ప్రశ్నించే గొంతుకనైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే తెలంగాణతో పాటు జిల్లా ప్రయోజనాలు కాపాడతానని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే సత్తా, దైర్యం ఒక్క బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని చెప్పారు . ప్రజల బతుకులను ఆగం చేసిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. మళ్లీ భ్రమలు కల్పిస్తూ మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ను ఎండగట్టాలని కోరారు .కెసిఆర్ ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో తాగు, తాగు, కరెంటు విషయాల్లో ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 100 రోజుల్లో రుణమాఫీ, పింఛన్లు ,తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓట్లు వేసుకునేటప్పుడు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క చందంగా కాంగ్రెస్ తీరు ఉందని ధ్వజమెత్తారు .నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఖమ్మం జిల్లా ప్రజలతోనే తన జీవితం ముడిపడి ఉందని, వారికి అండగా ఉంటానని చెప్పారు .నీతి, నిబద్ధతతో రాజకీయం చేస్తున్నటువంటి తాను సంపాదించిన సొమ్ములో కొంత తన కన్న బిడ్దలకు పెట్టుకున్నట్లే ప్రజలు కూడా పెట్టుకున్నామని , తన తండ్రి నామ ముత్తయ్య పేరుతో ట్రస్ట్ పెట్టి పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్నానని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయని, బిజెపి, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ప్రజల గుండెలు కూడా మండుతున్నాయని పేర్కొన్నారు.ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పారు .రెండు సార్లు గెలిపించి పార్లమెంటుకు పంపితే పెద్దఎత్తున కేంద్రంపై పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని , జిల్లా ప్రయోజనాలు కాపాడానని చెప్పారు. జిల్లాలో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులు తీసుకు వచ్చానని గుర్తు చేశారు.జిల్లాలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక తన ముద్ర ఉందని తెలిపారు. ఎంతో అభివృద్ధి చేశాను కాబట్టే పార్లమెంటుకు ఎక్కువ రోజుల హాజరై అధిక ప్రశ్నలడిగి ఉత్తమ పార్లమెంటేరియన్ గా జిల్లా కీర్తిని దేశం నలుమూలలా వ్యాపింపజేశానని తెలిపారు .
ప్రతి కార్యకర్త తనకు కన్నబిడ్డ లాంటి వాళ్లని , వారిని, కార్యకర్తలను నా కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటానని నామ స్పష్టం చేశారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరావు ,తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , స్థానిక మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు .