Telugu News

 ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి: ఎంపీ నామా

తెలంగాణ బిల్లుపై మొదటి ఓటు వేయడం అదృష్టం

0

 ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి: ఎంపీ నామా

❇️ తెలంగాణ పోరాటం చరిత్ర

❇️ తెలంగాణ బిల్లుపై మొదటి ఓటు వేయడం అదృష్టం

👉 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గారు శనివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జెండా ఆవిష్కరణ ,పార్టీ సమావేశం, విలేకరుల సమావేశంలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావం కెసిఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమం, తొలి ప్రభుత్వం ఏర్పాటు, రాష్ట్రం సాధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

ఇది కూడా చదవండి:-:ప్రజలతోనే నా జీవితం: నామా

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నామ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏవిధంగానైతే అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి చరిత్ర తిరగరాశారో అదే విధంగా కెసిఆర్ నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చరిత్రను తిరగ రాస్తుందని చెప్పారు .పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి నప్పుడు తాను మొదటి ఓటు వేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చాలా సంతోషంగా ఉందన్నారు .అందరి కష్టం వల్లే తెలంగాణ సాధించుకుని రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను చరిత్ర ఉన్నంతకాలం గుర్తుంచు కుంటారని చెప్పారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ యూ కాపాడుకోవాలని తెలిపారు.

ఇది కూడా చదవండి:- అభివృద్ధి ప్రధాత నామకే మా ఓటు : వాకర్స్ అభి మానం
పార్లమెంట్ల్లో ఎన్నికలు ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఇంటింటికి వెళ్లి తనను గెలిపించి కేసీఆర్ కు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ,
బస్సు విజయకుమార్, ఆర్జేసీ కృష్ణ, నాగరాజు బిచ్చాల తిరుమలరావు , ఉప్పల వెంకటరమణ ,తాజుద్దీన్, బొమ్మెర రామ్మూర్తి, సుబ్బా రావు, తదితరులు పాల్గొన్నారు